Army public School Recruitment: బీఈడీ ఉత్తీర్ణతో ఆర్మీ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Army public School Recruitment: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశంలోని...
Army public School Recruitment: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశంలోని పలుఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 136 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రైమరీ టీచర్(పీటీ) ఖాళీలు ఉన్నాయి.
* పీజీటీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
* ప్రైమరీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
* అభ్యర్థు వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 28-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పరీక్షను ఫిబ్రవరి 19,20 తేదీల్లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి..
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడుకి కోవిడ్ పాజిటివ్.. ట్వీట్ చేసిన జేపీ నడ్డా..
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో