APS Golconda: గోల్కోండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
APS Golconda Recruitment 2022: హైదరాబాద్‌లోని గోల్కొండలోని ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయితన ఈ స్కూల్‌లో పలు విభాగాల్లో ఉన్న ...
APS Golconda Recruitment 2022: హైదరాబాద్‌లోని గోల్కొండలోని ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయితన ఈ స్కూల్‌లో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) 06, ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ) 05, అడ్మిన్ సూపర్ వైజర్ 01, లైబ్రేరియన్ 01, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 02 ఖాళీలు ఉన్నాయి.
* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరాఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే బీఈడీ ఉత్తీర్ణ, సీటెట్/ టెట్ అర్హులై ఉండాలి.
* ప్రైమరీ టీచర్ పోస్టులకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్/టెట్ అర్హులై ఉండాలి.
* మిగత పోస్టులకు పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగనే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను దరఖాస్తులను నేరుగా ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, సన్‌సిటీ దగ్గర, హైదరాబాద్-500031 అడ్రస్‌కు సమర్పించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 04-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..