Army Jobs: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

Army Jobs: ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ పరిధిలోని వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కింద గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులను...

Army Jobs: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2022 | 9:43 AM

Army Jobs: ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ పరిధిలోని వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కింద గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* వీటిలో లైబ్రేరియన్‌, స్టెనో గ్రేడ్‌-2, ఎల్‌డీసీ, ఫైర్‌మెన్‌, మెసెంజర్‌, బార్బర్‌, వాషర్‌మెన్‌, రేంజ్‌ చౌకీదార్‌, డాఫ్ట్రీ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నియమిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 18,000 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…