Job Mela: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మంగళవారం భారీ జాబ్‌ మేళా.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హులు..

పలు ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా జాబ్‌ మేళాలను నిర్వహించిన అధికారులు తాజాగా మంగళవారం కర్నూలు జిల్లాలో మరో జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు...

Job Mela: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మంగళవారం భారీ జాబ్‌ మేళా.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హులు..
File Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2022 | 5:37 PM

పలు ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా జాబ్‌ మేళాలను నిర్వహించిన అధికారులు తాజాగా మంగళవారం కర్నూలు జిల్లాలో మరో జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు. రేపు (22-11-2022) రోజున ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. నంద్యాల పట్టణంలోని పీఎస్‌సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్‌ మేళాను నిర్వహించనున్నారు. ఇందులో మూడు కంపెనీలు పాల్గొననున్నాయి. ఇంతకీ ఏయే కంపెనీలు జాబ్‌ మేళాలో పాల్గొననున్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

బీపీఓ కన్వెర్జన్సీ కంపెనీలో కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 12,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. ప్యూర్ జల్ టెక్నాలజీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌ విద్యార్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న పురుషులు అర్హులు. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఎంపికై వారికి నెలకు రూ. 10,000 నుంచి రూ. 15,000+ ఇన్సెంటివ్‌లు అందిస్తారు. ఎంపికైన వారు నంద్యాలలో పనిచేయాల్సి ఉంటుంది. రాయిస్ కాపిటల్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు నంద్యాలలో పని చేయాల్సి ఉంటుంది.

ఇక జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్‌ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుంది. జాబ్‌ మేళాను నంద్యాల పీఎస్‌సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8297812530 ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..