APPSC Group 2 Recruitment 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను గురువారం (డిసెంబర్ 7) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 వరకు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం అవుతాయి..

APPSC Group 2 Recruitment 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే
APPSC Group 2 Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 07, 2023 | 8:54 PM

విజయవాడ, డిసెంబర్‌ 7: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను గురువారం (డిసెంబర్ 7) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 వరకు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం అవుతాయి.

వచ్చే ఏడాది జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్‌ 2 సిలబస్‌ ప్రకటించిన కమిషన్‌ తాజాగా పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న నిరుద్యోగుల ఆశ నెరవేరినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.