APPSC Group 1 Mains: ‘ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలు మాత్రమే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. అయితే గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగిన నాటి నుంచి 1:100 నిష్పత్తిలో..

APPSC Group 1 Mains: 'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి'
APPSC Group 1 Mains
Follow us

|

Updated on: Sep 03, 2024 | 3:23 PM

అమరావతి, సెస్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలు మాత్రమే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. అయితే గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగిన నాటి నుంచి 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. దీనిపై అటు రాష్ట్ర సర్కార్‌ గానీ, ఇటు కమిషన్‌గానీ స్పందించింది లేదు. తాజాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘వారధి’ కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ అభ్యర్ధుల నుంచి అర్జీలు స్వీకరించారు.

విజయవాడ పశ్చిమ బైపాస్‌ విస్తరణలో తమకు రావాల్సిన పరిహారం త్వరితగతిన ఇప్పించాల్సిందిగా ఎంపీ పురందేశ్వరిని కోరారు. స్థలాల అమ్మకం పేరిట దుర్గాదేవి అనే మహిళ కోట్ల రూపాయలు వసూలు చేశారని పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. సదరు మహిళపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యలపై స్పందించిన పురందేశ్వరి.. హోంమంత్రి వంగలపూడి అనితకు ఫోన్‌ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్‌ఎస్‌సీ సీపీఓ టైర్-1 సెలక్షన్‌ లిస్ట్ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన టైర్ 1 రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 27 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను కూడా పురుష, మహిళా అభ్యర్థులకు వేర్వేరుగా వెల్లడించారు. పేపర్-1 పరీక్షలో మొత్తం 7,335 మంది మహిళా అభ్యర్థులు, 76,278 మంది పురుష అభ్యర్థులు అర్హత సాధించారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్‌ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి'
'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి'
రాత్రికి రాత్రి ఒకే టైంలో.. నేలకూలిన 50వేలకు పైగా చెట్లు..!
రాత్రికి రాత్రి ఒకే టైంలో.. నేలకూలిన 50వేలకు పైగా చెట్లు..!
వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం
వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ .. ఆ ఇద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ .. ఆ ఇద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి
ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్
ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్
ఆచి తూచి అడుగులేస్తున్న దేవర.. వార్ 2 కూడా క్లోజ్. నెక్స్ట్ ..?
ఆచి తూచి అడుగులేస్తున్న దేవర.. వార్ 2 కూడా క్లోజ్. నెక్స్ట్ ..?
ఎవరినీ వదిలిపెట్టం.. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థ: రేవంత్
ఎవరినీ వదిలిపెట్టం.. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థ: రేవంత్
బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు..
బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు..
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలంటే..?
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలంటే..?