AP SSC 2024 State 1st Ranker: ‘పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.. ఎన్ని మార్కులు వచ్చాయంటే

ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 6.16 వేల రెగ్యులర్‌ విద్యార్ధుల్లో 86.69 శాతం (5,34,574 ) ఉత్తీర్ణత పొందారు. జిల్లాల వారీగా చూస్తూ పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 96.37 శాతం ఉత్తీర్ణత నమోదవడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణత పొంది చివరి స్థానంలో నిలిచింది...

AP SSC 2024 State 1st Ranker: 'పది' ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.. ఎన్ని మార్కులు వచ్చాయంటే
AP SSC 2024 Toppers List
Follow us

|

Updated on: Apr 22, 2024 | 12:43 PM

అమరావతి, ఏప్రిల్ 22: ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 6.16 వేల రెగ్యులర్‌ విద్యార్ధుల్లో 86.69 శాతం (5,34,574 ) ఉత్తీర్ణత పొందారు. జిల్లాల వారీగా చూస్తూ పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 96.37 శాతం ఉత్తీర్ణత నమోదవడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణత పొంది చివరి స్థానంలో నిలిచింది. బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే బాలికలు 4.98 శాతం అధికంగా పాస్‌ పర్సెంటైల్‌ సాధించారు.

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.

రాష్ట్రంలో మొత్తం 12 రకాల మేనేజ్‌మెంట్లలో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత పొందారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ స్కూల్స్ విద్యార్ధులు అత్యధికంగా 98.43 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,743 కేంద్రాలలో 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles