AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. ఎంత మంది పాస్‌ అయ్యారంటే..

AP Inter Supply Results 2022: ఆంధప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు...

AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. ఎంత మంది పాస్‌ అయ్యారంటే..
AP Inter Results
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2022 | 12:58 PM

AP Inter Supply Results 2022: ఆంధప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇంటర్‌ సప్లి పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1022 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 429 మాల్‌ప్రాక్టిస్‌ కేసులను నమోదు చేశారు.

ఇక ఉత్తీర్ణత శాతం విషయానికొస్తే ఫస్ట్‌ ఇయర్‌లో జనరల్ విభాగంలో 35 శాతం పాస్‌ కాగా వొకేషన్‌లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో జనరల్‌ విభాగంలో 33 శాతం, వొకేషన్‌లో 46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోమని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌ విభాగంలో మొత్తం 68 శాతం మంది, సెకండ్‌ జనరల్‌ విభాగంలో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్‌ విషయానికొస్తే ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 66 శాతం మంది, సెకండ్‌ ఇయర్‌లో 80 శాతం మంది పాస్‌ అయ్యారు. ఇక మొత్తం అన్ని విభాగాలను పరగణలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇంటర్‌లో మొత్తం 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.