AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET Results 2026: విద్యార్ధులకు తప్పని ఎదురు చూపులు.. EAPCET ఫలితాలు మళ్లీ వాయిదా..?

AP EAPCET Results 2026 postponed: రాష్ట్ర ఈఏపీసెట్ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ ఫలితాల ప్రక్రియ పూర్తయ్యాక ర్యాంకులను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతో ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఫలితాల విడుదల..

AP EAPCET Results 2026: విద్యార్ధులకు తప్పని ఎదురు చూపులు.. EAPCET ఫలితాలు మళ్లీ వాయిదా..?
AP EAPCET Result Postponed
Srilakshmi C
|

Updated on: Jun 21, 2026 | 10:11 AM

Share

అమరావతి, జూన్‌ 21: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు జూన్‌ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈఏపీసెట్‌సెట్‌ ఛైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

మే 12 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిదే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 1 నాటికే ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల కోసం వాయిదా వేశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ర్యాంకులు కేటాయించాలంటే ఇంటర్మీడియట్‌ మార్కులూ తప్పనిసరి. పైగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సెకండ్‌ ఇంటర్‌ విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం కల్పించింది. లక్షకుపైగా విద్యార్థులు తమ మార్కుల మెరుగుదలకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌ ర్యాంకుల్లో వీరికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫలితాలను వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

జూన్‌ 18న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఒకట్రెండు రోజుల్లో ఎప్‌సెట్‌ ర్యాంకులూ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. సీబీఎస్‌ఈ రివైడ్జ్‌ ఫలితాలను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్‌సెట్‌ ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని విద్యాశాఖ భావిస్తుంది. అందువల్ల సీబీఎస్‌ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదలైన తర్వాత ఈఏపీసెట్‌ ర్యాంకులను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Follow Us
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!