AP EAPCET 2026 Exam Dates: ఈసారి ఈఏపీసెట్‌కు ఇంటర్ వెయిటేజ్ ఉంటుందా? తాజా అప్‌డేట్స్ ఇవే..
ఈఏపీసెట్ 2026కు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 24వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా.. రూ.1000 నుంచి రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10, 2026వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అంటే ఈ గడువు ఈ రోజు రాత్రి 11 గంటలతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు..

అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2026కు రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 24వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా.. రూ.1000 నుంచి రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10, 2026వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఈ గడువు ఈ రోజు రాత్రి 11 గంటలతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 11 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా పొరబాట్లు చేసిఉంటే సరిచేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించినవారి కోసం మాత్రమే అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది.
ఈఏపీసెట్ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రభుత్వ, అఫిలియేటెడ్ కాలేజీల్లో బీటెక్, బీఈ, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈ విద్యా సంవత్సరం కూడా ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. మే 12 నుంచి ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్‌కార్డులు ఏప్రిల్ 28 నుంచి ఈఏపీసెట్ వెబ్‌సైట్‌తో పాటు, ప్రభుత్వ వాట్సప్ నంబరు నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు. మొత్తం 160 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో గుర్తించాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. ఇంజినీరింగ్ విభాగంలో మ్యాథమెటిక్స్‌లో 80, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో బోటనిలో 40, జువాలజీలో 40, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 11 నుంచి 13 వరకు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 28 నుంచి
- ఏపీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 12, 15, 18 తేదీల్లో
- ఏపీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష తేదీలు: మే 19, 20 తేదీల్లో.
- ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల తేదీ: మే 23, 2026.
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 1, 2026.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




