AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీ గడప దాటుతున్నది ఎంతమంది? ఉన్నత విద్యలో దేశవ్యాప్త అసమానతలపై కీలక నివేదిక!

దేశంలో ఉన్నత విద్య అందుబాటులో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. AISHE 2021-22 నివేదిక ప్రకారం చండీగఢ్‌లో ఉన్నత విద్య GER 64.8 శాతంగా ఉండగా, బీహార్‌లో 17.1 శాతంగా నమోదైంది. మహిళల నమోదు నిష్పత్తి పురుషుల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రాంతీయ అసమానతలు, కాలేజీల కొరత, ఆర్థిక ఇబ్బందులు ఉన్నత విద్యకు సవాలుగా మారుతున్నాయి.

కాలేజీ గడప దాటుతున్నది ఎంతమంది? ఉన్నత విద్యలో దేశవ్యాప్త అసమానతలపై కీలక నివేదిక!
Higher Education In India
Santosh Nair
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 11:10 AM

Share

భారతదేశంలోని రెండు వేర్వేరు మూలల్లో ఒకే వారంలో జన్మించిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ఒకరు బీహార్‌లోని చిన్న పట్టణానికి చెందిన మీనా, మరొకరు చండీగఢ్‌కు చెందిన నేహా.. ఇద్దరికీ 18 ఏళ్లు వచ్చేసరికి ఒకే రకమైన మార్కులు వచ్చాయి. కానీ, ఆ ఫలితాల తర్వాత వారి జీవిత ప్రయాణాలు పూర్తిగా వేర్వేరు దిశల్లోకి వెళ్లిపోయాయి. నేహాకు ఇంటి నుంచి గంట ప్రయాణంలో ఎన్నో మంచి కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీనా తండ్రికి జిల్లాలో ఒకే ఒక్క కాలేజీ కనిపించింది.. మెరుగైన చదువు కోసం రాత్రింబవళ్లు ప్రయాణించి, హోస్టల్‌లో ఉంటూ వేరే నగరంలో చదవాల్సి ఉంటుంది. మీనా తండ్రికి కుమార్తెపై ప్రేమ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిమితులు, భద్రతా కారణాలు ఆయన నిర్ణయాన్ని మార్చేశాయి. ఈ ఇద్దరి జీవితాల్లో వ్యత్యాసానికి కుటుంబాల తప్పు కారణం కాదు.. వారు పుట్టిన భౌగోళిక ప్రాంతం (మ్యాప్) గీసిన సరిహద్దులే అసలు కారణం..

ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి (GER) – గణాంకాల యథార్థం:

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE 2021-22) నివేదిక ప్రకారం.. దేశంలో కాలేజీ వయస్సు ఉన్న వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrolment Ratio – GER).. 28.4 శాతంగా ఉంది. అంటే ప్రతి పది మంది యువతలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నత విద్యకు చేరువవుతున్నారు.

మహిళల నమోదులో పురోగతి: ఒకప్పుడు ఉన్నత విద్యలో పురుషుల కంటే చాలా వెనుకబడిన మహిళలు, ఈ సర్వేలో పురుషుల (28.3%) కంటే కాస్త మెరుగ్గా 28.5% నమోదు నిష్పత్తి సాధించి ముందంజలో నిలిచారు.

సామాజిక వర్గాల నమోదు: ఎస్సీ (SC) విద్యార్థులలో నమోదు నిష్పత్తి 25.9%గా, ఎస్టీ (ST) విద్యార్థులలో 21.2%గా నమోదైంది. స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్ల కారణంగా ఈ నిష్పత్తి పెరిగినప్పటికీ, జాతీయ సగటు కంటే ఇవి ఇంకా తక్కువగానే ఉన్నాయి.

రాష్ట్రాల మధ్య కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భారీ అంతరం:

జెండర్ (లింగం) లేదా సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరం కంటే.. రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతీయ అంతరమే అత్యంత తీవ్రమైనదిగా ఈ నివేదిక తేల్చింది.

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం GER (ఉన్నత విద్యా నమోదు నిష్పత్తి)
చండీగఢ్ (Chandigarh) 64.8%
పుదుచ్చేరి (Puducherry) 61.5%
ఢిల్లీ (Delhi) 49.0%
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) 24.1%
జార్ఖండ్ (Jharkhand) 18.6%
బీహార్ (Bihar) 17.1%

అత్యధిక నమోదు ఉన్న చండీగఢ్‌కు, అత్యల్పంగా ఉన్న బీహార్‌కు మధ్య వ్యత్యాసం దాదాపు నాలుగు రెట్లు ఉండటం గమనార్హం.

అసమానతలకు ప్రధాన కారణాలు:

వలసలు – మెట్రో నగరాల ప్రయోజనం: ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తాయి. అందువల్ల అక్కడ లెక్కింపు ఎక్కువగా కనిపిస్తుంది.

పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోవడం: బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 8వ లేదా 10వ తరగతితోనే చదువు ఆపేసే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కాలేజీకి చేరే శ్రేణి చిన్నదవుతోంది.

ఆర్థిక భారాలు – స్థానిక మౌలిక వసతులు: గ్రామీణ/పేద ప్రాంతాల్లో కాలేజీలు అందుబాటులో లేకపోవడం, కుటుంబాల్లో అదనపు సంపాదన కోసం చదువును మధ్యలోనే మాన్పించడం ప్రధాన సమస్యలుగా మారాయి.

రాజ్యాంగ సవాలు:

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలను హామీ ఇస్తోంది. ఆ హామీ రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆగిపోకూడదు. ఒక చిన్నారి తాను పుట్టిన ప్రదేశం ఆధారంగా విద్యా అవకాశాలను కోల్పోవలసి రావడం మన సమాజ వ్యవస్థలోని లోపానికి నిదర్శనం.

ప్రశ్నించుకోవాల్సింది ఒక్కటే: మీర గనుక సరిహద్దు పక్కన ఉన్న మరొక రాష్ట్రంలో జన్మించి ఉంటే.. మీ చదువు ప్రయాణం కూడా కాలేజీ గేటు వరకు సాగేదా?

Follow Us
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..