Andhra Pradesh Jobs: ఏపీ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా 3,393 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..!

Andhra Pradesh Jobs: ఏపీ ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పోస్టులకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది..

Andhra Pradesh Jobs: ఏపీ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా 3,393 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..!
Follow us

|

Updated on: Oct 24, 2021 | 1:30 PM

Andhra Pradesh Jobs: ఏపీ ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పోస్టులకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 3,393 కాంటాక్ట్‌ పద్దతిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుల‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం అకాడ‌మిక్ మెరిట్ ద్వారానే అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుక అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హతలు: ► ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థి ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి.

► నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 40 ఏళ్లలోపు) వయసు కలిగి ఉండాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 6, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎంపిక విధానం..

► ముందుగాగా పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవాలి. బీఎస్సీ నర్సింగ్‌ మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు.  కాంట్రాక్టు విధానంలో నియామకాలు ఉంటాయి. ముందుగా ఏడాది పాటు కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు. పనితీరు ఆధారంగా సర్వీసు కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 1664 పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. ఆ మార్కుల ఆధారంగానే ఎంపిక..!

Education: ఆ దేశంలో హోంవర్క్ లేకుండా కొత్త విద్యా చట్టం.. పిల్లలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకు అంటున్న ప్రభుత్వం