Education: ఆ దేశంలో హోంవర్క్ లేకుండా కొత్త విద్యా చట్టం.. పిల్లలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకు అంటున్న ప్రభుత్వం

China Education Reforms: చైనాలో విద్యార్థుల హోంవర్క్, ట్యూషన్ ను తగ్గించడానికి తీసుకొచ్చిన నూతన విద్యా చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ దేశ..

Education: ఆ దేశంలో హోంవర్క్ లేకుండా కొత్త విద్యా చట్టం.. పిల్లలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకు అంటున్న ప్రభుత్వం
China Education Reforms
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2021 | 12:04 PM

China Education Reforms: చైనాలో విద్యార్థుల హోంవర్క్, ట్యూషన్ ను తగ్గించడానికి తీసుకొచ్చిన నూతన విద్యా చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ లో కొత్త విద్యా చట్టానికి ఆమోద ముద్ర వేసింది. చదువుకునే బాలబాలికలకు తగిన విశ్రాంతి, శరీరక విద్యల మధ్య సమతుల్యత కోరుతూ విద్యావేత్తలు సూచించిన కొత్త విద్యా చట్టం అమల్లోకి వచ్చింది. స్టూడెంట్ పై హోమ్‌వ‌ర్క్ వ‌త్తిడి లేకుండా చేయడానికే ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అంతేకాదు ఆన్లైన్ గేమ్స్ కు బానిసవుతున్న చిన్నారులను దారిలో పెట్టేందుకు కూడా ఈ చట్టంలో కొన్ని చర్యలను పొందుపరిచారు. చిన్నారులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువు చదువు అంటూ ప్రైవేట్ ట్యూషన్ల, ఒత్తిడితో కూడుకున్న హోమ వర్క్ లు చేయాల్సిన అవసరం లేని విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. స్కూల్ ముగిసిన త‌ర్వాత ప్రైవేటు ట్యూష‌న్లు వెళ్లకుండా ఉండే రీతిలోనూ కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతున్న స్టూడెంట్స్ ను మళ్ళీ సరైన దారిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. ఇక నుంచి స్టూడెంట్స్ కనుక చెడుగా ప్రవ‌ర్తించినా, నేరాల‌కు పాల్పడినా, చట్టవిరుద్దమైన కార్యకలాపాలను చేపట్టినా.. ఆ విద్యార్ధుల తల్లిదండ్రులను కఠినంగా శిక్షించేలా నూతన చట్టాన్ని తాయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చైనా పార్లమెంట్ ప్రకటించింది.

స్కూల్స్ లో విద్యార్ధులకు చదువు గురించి ఒత్తిడి పెరగకుండా చూడాలని స్థానిక ప్రభుత్వానికి సూచించింది. ఇక నుంచి విద్యార్థుల‌ చదువుకు కొంత సమయం కేటాయిస్తూనే కావాల్సినంత విశ్రాంతినిస్తూ.. శరీరక వ్యాయామం చేసే విధంగా ప్లాన్ చేయాలనీ సూచిందింది. వీడియో గేమ్స్ ఆడే మైన‌ర్లు ఇటీవ‌ల విద్యాశాఖ మంత్రి కొత్త ఆదేశాలు జారీ చేసింది. వారంలో మూడు రోజులు అంటే.. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ రోజుల్లో కేవ‌లం గంట సమయం మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ ఆదుకోవాలని స్టూడెంట్స్ కోసం ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Also Read:  మా పిల్లలకు రోజుకు ఆరు లీటర్ల పాలు.. 100 డైపర్లు అవసరం.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న దంపతులు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!