Inter Public Exams 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్లలో కీలక మార్పులు.. ఇకపై 32 పేజీల బుక్‌లెట్ అందజేత!
AP Inter 2026 Public exam question paper model: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల ఇంటర్ పబ్లిక్ పరీక్షల 2026 షెడ్యూన్‌ను కూడా విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు ఈసారి..

అమరావతి, నవంబర్ 21: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల ఇంటర్ పబ్లిక్ పరీక్షల 2026 షెడ్యూన్‌ను కూడా విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు ఈసారి 10.40 లక్షల మంది విద్యార్ధులు పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5.35 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 5.05 లక్షల మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షల సమయంలో 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్ అందజేయనున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలుచేస్తుండటంతో ఇంటర్ ప్రశ్నాపత్రాలు మారాయి. కొత్త విధానం ప్రకారం తొలిసారి ఒకమార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. దీంతో ప్రశ్నల సంఖ్య పెరిగింది. మ్యాథమెటిక్స్‌లో గతంలో 150 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. ఈసారి మాత్రం కేవలం వంద మార్కులకు ఒకటే పేపర్‌ను తీసుకొచ్చారు. ఇక కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని ఇటీవల ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
దీంతో సమాధానాల బుక్‌లెట్ పేజీలను ఇంటర్ బోర్డు పెంచింది. ఇప్పటివరకు 24 పేజీల బుక్‌లెట్ ఉండేది. మారిన ప్రశ్నాపత్రం దృష్టిలో ఉంచుకుని ఇకపై 32 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నాఉ. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, కామర్స్‌లకు 32 పేజీల బుక్‌లెట్ వస్తుంది. జీవశాస్త్రంలో వృక్షశాస్త్రానికి, జంతుశాస్త్రానికి మాత్రం 24 పేజీల రెండు బుక్‌లెట్‌లు అందజేస్తారు. ఈ రెండు పేపర్లకు ఒకే రోజు పరీక్ష ఉంటుంది. దీంతో ప్రశ్నపత్రంలో ఏ, బీ సెక్షన్లుగా విడిగా వృక్ష, జంతుశాస్త్రాల ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు ఆయా బుక్‌లెట్‌లలో జవాబులను విడివిడిగా రాయవల్సి ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులకు గతంలో మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్ అందజేస్తారు.
కెమిస్ట్రీ, ఫిజిక్స్, జీవశాస్త్రం సబ్జెక్టులకు ఫస్ట్ ఇయర్‌లో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణత పొందాలంటే 35 శాతం అంటే 29.75 మార్కులు తెచ్చుకోవల్సి ఉండగా.. ఆ మార్కులను 29కి తగ్గించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 85 మార్కులకు ఈ పరీక్ష ఉంటే 30 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సంవత్సరాలకు కలిపి 35 శాతం అంటే 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా.. ఆ మార్కులను 59కి తగ్గించారు. ఈ అరమార్కును సర్దుబాటు చేసి, రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉత్తీర్ణత మార్కులను 10.5 నుంచి 11కు పెంచారు. అలాగే జాగ్రఫీ పరీక్ష గతంలొ 75 మార్కులకు ఉంటే.. వాటిని 85 మార్కులకు పెంచారు. ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు కలిపి ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటాయి. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు. వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న గ్రూపులోని ఐదు సబ్జెక్టులతోపాటు ఆరో సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న దానిలో ఉత్తీర్ణత తప్పనిసరి కాదనే నిబంధన కూడా తీసుకువచ్చింది. అంటే ఆరో సబ్జెక్టులో ఫెయిల్ అయినా, పాస్ అయినా ఐదు సబ్జెక్టులకు మాత్రమే మార్కులు ఇస్తారు. ఆరో సబ్జెక్టుకు విడిగా మార్కుల మెమో ఇస్తారు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం ప్రశ్నపత్రాలు, జవాబుల బుక్‌లెట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. పాత విధానం ప్రకారంగానే పరీక్షలు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








