AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Job Calendar 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌! శాఖల వారీగా ఖాళీలు ఇవే

Department-wise vacancies in Andhra Pradesh Job Calendar 2026: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరించింది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ..

AP Govt Job Calendar 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌! శాఖల వారీగా ఖాళీలు ఇవే
Andhra Pradesh Govt To Release Job Calendar Soon
Srilakshmi C
|

Updated on: Nov 23, 2025 | 5:06 PM

Share

అమరావతి, నవంబర్‌ 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరించింది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయిస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇందులో ఖాళీల వివరాలను ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. అందిన మాచారం మేరకు అన్ని శాఖల్లో దాదాపు 30 శాతం మేర ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. డీఆర్‌కు వచ్చే ఖాళీలు 99 వేల వరకు ఉండే అవకాశం ఉంది. మరో 24 విభాగాలు ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. అలాగే ఇంకో 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్‌లో ఉంది. ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క ఓ కొలిక్కి వస్తుంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

రెవెన్యూ శాఖలో మొత్తం 13 వేల ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలోని 4,787 ఖాళీలను అధికారులు నిర్ధారించారు. ఇందులో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 వరకు పోస్టులు ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో 23 వేల పోస్టులను నియమించుకునే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు ఉండగా.. వీటిల్లో 2,600 పోస్టులు నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుండగా.. వీటిలో డీఆర్‌ పోస్టులు 2,400 వరకు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖలో 26 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మరో మూడు వేల పోస్టులను ఇన్‌సర్వీస్‌ పదోన్నతులతో భర్తీ చేస్తారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్‌ సిటిజన్స్‌ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 1,820 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

పాఠశాల విద్యలో బోధన, బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30 వేల వరకు ఉండొచ్చని అంచనా. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక పాఠశాల విద్య శాఖతో సహా దాదాపు 24 విభాగాల్లో ఖాళీల వివరాలను ఇంకా నిర్ధారించలేదు. వీటన్నింటి లెక్కలు తేలితే నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..