CLAT 2026 Exam Date: క్లాట్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
CLAT 2026 admit card Download Link: దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 మరో పది రోజుల్లోనే జరగనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు తాజాగా..

హైదరాబాద్, నవంబర్ 23: దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 మరో పది రోజుల్లోనే జరగనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాల లాగిన్ అయి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ లా యూనివర్సిటీస్ ప్రకటన వెలువరించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ 2026) డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది.
నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) అందిస్తున్నాయి. క్లాట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం (యూజీ, పీజీ, డిగ్రీ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందిన వారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ పూర్తి చేయవల్సి ఉంటుంది. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందిన వారు ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
క్లాట్-2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




