AP 10th Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. వాయిదా పడనున్న పదో తరగతి పరీక్షలు.? పూర్తి వివరాలు..
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం. దీనికి కారణం...
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇంటర్ పరీక్షల(Inter Exams) షెడ్యూల్‌లో మార్పు జరగడమే. జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెన్త్ పరీక్షలు మే రెండో తేదీ నుంచి 13 వరకు జరగనున్నాయి.
దీంతో ఒకేసారి ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుందన్న కారణంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మార్పులు చేసిన షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు. దీంతో ఈ రోజు (సోమవారం) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: RRR : నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటున్న తారక్ చరణ్.. “ఆర్ఆర్ఆర్” నుంచి మరోసాంగ్ ప్రోమో….
AP Politics: పరిటాల అడ్డాలో హీటెక్కుతున్న రాజకీయం.. ధర్మవరంలో శ్రీరామ్‌కు పోటీగా మరో నేత..!
Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..