Bank Jobs: అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..

Bank Jobs: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతోన్న వారికి అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మంచి అవకాశాన్ని కలిపించింది. అనంతపురం జిల్లాలో అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌...

Bank Jobs: అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..
Dccb Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 23, 2021 | 12:31 PM

Bank Jobs: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతోన్న వారికి అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మంచి అవకాశాన్ని కలిపించింది. అనంతపురం జిల్లాలో అనంతపుర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఏడీసీసీబీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్కులు (66), అసిస్టెంట్‌ మేనేజర్లు (20) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్కులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

* అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతీ తప్పుడు సమాధానికి 0.25 చొప్పున నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 03-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Share Market: బేర్ మన్న స్టాక్ మార్కెట్లు.. ఆరంభంలోనే నేల చూపులు చూస్తున్న సెన్సెక్స్..

50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?

Kajal Aggarwal: మైమరిపిస్తున్న చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..