ALIMCO Recruitment 2022: నెలకు రూ.2,60,000ల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO)... దేశ వ్యాప్తంగా ఉన్న అలిమ్‌కో ప్రధాన, సహాయక ఉత్పత్తి, ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన..
ALIMCO Manager Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO)… దేశ వ్యాప్తంగా ఉన్న అలిమ్‌కో ప్రధాన, సహాయక ఉత్పత్తి, ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 76 జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఆఫీసర్, అకౌంటెంట్, మార్కెంటింగ్ అసిస్టెంట్,స్టెనోగ్రాఫర్, వర్క్‌మ్యాన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, పీజీడీఎం, డిప్లొమా, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు అగస్టు 1, 2022 నాటికి 30 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, టైపింగ్ స్కిల్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్ 20, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.17,820ల నుంచి 2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఖాళీల వివరాలు:
- జనరల్ మేనేజర్(మెటీరియల్ మేనేజ్‌మెంట్) పోస్టులు: 1
- జనరల్ మేనేజర్(ప్రొడక్షన్) పోస్టులు: 1
- జనరల్ మేనేజర్(మార్కెటింగ్) పోస్టులు: 1
- డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్ (పి అండ్ ఏ) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్(లాజిస్టిక్స్, వేర్‌హౌస్ & ట్రాన్స్‌పోర్టేషన్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్(క్వాలిటీ కంట్రోల్) పోస్టులు: 1
- మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులు: 2
- మేనేజర్ (ప్రొస్తెటిక్స్ అండ్ ఆర్థోటిక్ డిపార్ట్‌మెంట్) పోస్టులు: 1
- మేనేజర్ (సేల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్) పోస్టులు: 1
- మేనేజర్ (మార్కెటింగ్) పోస్టులు: 1
- మేనేజర్ (మెయింటెనెన్స్ మెకానికల్) పోస్టులు: 1
- డిప్యూటీ మేనేజర్(ఎక్స్‌పోర్ట్స్) పోస్టులు: 1
- డిప్యూటీ మేనేజర్(ఎంఎం) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్(కాస్టింగ్) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్(టూల్ రూమ్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్(మార్కెటింగ్) పోస్టులు: 2
- జూనియర్ మేనేజర్(టూల్ రూమ్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్(ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్(ప్రొడక్షన్ ప్లాస్టిక్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్- ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు: 2
- జూనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్ (అకౌంట్స్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్ (డిజైన్ అండ్ డెవలప్‌మెంట్) పోస్టులు: 1
- జూనియర్ మేనేజర్ (క్వాలిటీ కంట్రోల్) పోస్టులు: 1
- ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులు: 3
- ఆఫీసర్ (మార్కెటింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్) పోస్టులు: 1
- ఆఫీసర్ (డిజైన్ & డెవలప్‌మెంట్) పోస్టులు: 1
- ఆఫీసర్ (ప్రొడక్షన్- ఫ్యాబ్రికేషన్ షాప్) పోస్టులు: 1
- ఆఫీసర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 1
- ఆఫీసర్ (అకౌంట్స్) పోస్టులు: 2
- ఆఫీసర్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) పోస్టులు: 1
- ఆఫీసర్ (క్వాలిటీ కంట్రోల్- ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 1
- ఆఫీసర్ (ప్రాజెక్ట్) పోస్టులు: 1
- అకౌంటెంట్ పోస్టులు: 2
- మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులు: 6
- షాప్ అసిస్టెంట్ (సీఎన్‌సీ ఆపరేటర్) పోస్టులు: 4
- ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్/ వెల్డర్ పోస్టులు: 1
- అసిస్టెంట్- పెయింట్ అండ్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్ పోస్టులు: 1
- షాప్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 1
- క్యూసీ అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులు: 2
- అసిస్టెంట్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు: 2
- క్లర్క్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 2
- స్టెనోగ్రాఫర్ పోస్టులు: 1
- సర్వీస్ అసిస్టెంట్ పోస్టులు: 2
- వర్క్‌మ్యాన్(మెయింటెనెన్స్- ఎంఎంటీఎం) పోస్టులు: 1
- వర్క్‌మ్యాన్(మెయింటెనెన్స్- ప్లంబర్) పోస్టులు: 1
- వర్క్‌మ్యాన్(మెయింటెనెన్స్- ఫిట్టర్) పోస్టులు: 1
- వర్క్‌మ్యాన్ (మెయింటెనెన్స్- ఎలక్ట్రికల్) పోస్టులు: 1
- అసెంబ్లర్ పోస్టులు: 1
- స్టోర్ అసిస్టెంట్ ఎంఎం- ప్లాస్టిక్స్ పోస్టులు: 1
- స్టోర్ అసిస్టెంట్ ఎంఎం- జనరల్ స్టోర్స్ పోస్టులు: 4
అడ్రస్: The Manager (Administration), ALIMCO, Naramau, G. T. Road, Kanpur-209217.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.