AIIMS Kalyani Recruitment 2022: నెలకు రూ.1,68,900ల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Kalyani).. ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AIIMS Kalyani Recruitment 2022: నెలకు రూ.1,68,900ల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
Aiims Kalyani
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2022 | 4:56 PM

AIIMS Kalyani Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Kalyani).. ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 89

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్ పోస్టులు: 25
  • అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 19
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 19
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు: 26

విభాగాలు: అనెస్తీషియా, అనటామీ, బయోకెమిస్ట్రీ, బర్న్‌-ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటీరోలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, ఫిజియాలజీ, పాథాలజీ, రేడియోలజీ తదితర విభాగాలు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,01,500ల నుంచి రూ. 1,68,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎమ్‌ లేదా తత్సమాన డిగ్రీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1500
  • ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.1200
  • ఎస్సీ/ఎస్టీ/మ‌హిళ‌ల అభ్యర్ధులకు: రూ.1200

దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఫిల్‌ చేసిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపాలి (జూన్‌ 24, 2022న ప్రకటన వెలువడింది).

అడ్రస్‌:

The Administrative Officer, Recruitment Cell, All India Institute of Medical Sciences, Kalyani, NH-34 Connector, Basantapur, Saguna, Nadia, West Bengal – 741245.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.