Engineering Classes: సెప్టెంబ‌ర్ 15 నుంచి ఫ‌స్ట్ ఇయ‌ర్‌ త‌ర‌గ‌తుల ప్రారంభం.. ప్ర‌క‌టించిన ఏఐసీటీఈ..

Engineering Classes: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రంగాల్లో విద్యా రంగం ఒక‌టి. ఏకంగా రెండు అక‌డ‌మిక్ ఇయ‌ర్స్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. లాక్‌డౌన్‌, వైర‌స్ తీవ్ర‌త కార‌ణంగా..

Engineering Classes: సెప్టెంబ‌ర్ 15 నుంచి ఫ‌స్ట్ ఇయ‌ర్‌ త‌ర‌గ‌తుల ప్రారంభం.. ప్ర‌క‌టించిన ఏఐసీటీఈ..
Aicte Acadamic Year
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2021 | 6:03 AM

Engineering Classes: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రంగాల్లో విద్యా రంగం ఒక‌టి. ఏకంగా రెండు అక‌డ‌మిక్ ఇయ‌ర్స్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. లాక్‌డౌన్‌, వైర‌స్ తీవ్ర‌త కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత ప‌డ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించారు. అయితే ప‌రీక్ష‌ల విష‌యానికొచ్చేస‌రికి నిర్వ‌హించ‌లేక వాయిదా వేయ‌డ‌మో, ప్ర‌మోట్ చేయ‌డ‌మో చేస్తున్నారు. టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ) ప‌రిధిలోకి వ‌చ్చే కళాశాల‌ల‌న్నీ ప్ర‌స్తుతం మూత‌ప‌డి ఉన్న‌ విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై ఏఐసీటీఈ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ విష‌య‌మై గురువారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఏఐసీటీఈ ప‌రిధిలోకి వ‌చ్చే క‌ళాశాలల్లో మొద‌టి ఏడాది విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు సెప్టెంబ‌ర్ 15 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఇంజ‌నీరింగ్ వంటి కోర్సుల‌కు ఆగ‌స్టు 31న తొలి విడ‌త కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నున్నట్లు తెలిపారు. ఇక సెకండ్ కౌన్సిలింగ్ సెప్టెంబ‌ర్ 9న నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను క‌రోనా కార‌ణంగా వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇక మేనెజ్‌మెంట్ కోర్సుల‌కు సంబంధించిన కోర్సుల‌కు జూలై 1 నుంచి త‌ర‌గతులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఏఐసీటీఈ తెలిపింది. ఇక ఆన్‌లైన్‌లో జ‌రిగే డిస్టెన్స్ లెర్నింగ్‌కు సంబంధించి అడ్మిష‌న్ల‌ను జూన్ 30 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన ఏఐసీటీఈ.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచ‌న‌ల మేర‌కు ఇందులో మార్పులు చేర్పులు ఉండొచ్చ‌ని చెప్పుకొచ్చింది.

Also Read: హిమాలయాల మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…!

కరోనా వ్యాక్సిన్‌ పేటెంట్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన టెడ్రోస్

Health Tips: తగినంత నిద్ర లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త.!!