AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Jobs 2022: ఇంటర్వ్యూ ఆధారంగానే.. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (AIAHL).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

Air India Jobs 2022: ఇంటర్వ్యూ ఆధారంగానే.. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Air India Jobs
Srilakshmi C
|

Updated on: Mar 17, 2022 | 8:54 AM

Share

Al Assets Holding Limited Recruitment 2022: ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (AIAHL).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 5

పోస్టులు:

  • కంపెనీ సెక్రటరీ పోస్టులు: 1
  • మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • ఆఫీసర్‌ ఫైనాన్స్‌ పోస్టులు: 1
  • ఆఫీసర్‌ అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులు: 2

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 65,000ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ (ICSI)లో ఫెలో/అసోసియేట్‌ మెంటర్‌, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్‌ అకౌంటెంట్స్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (ఇంటర్‌)/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్‌ (ఇంటర్‌), ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Manager Personnel and admin AI Assets Holding Limited (AIAHL), Room No-205, 2nd floor, AI Reservation Building, safdarjung airport, New Delhi-110003.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIATSL Jobs 2022: ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో 255 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక..