AIC Recruitment: అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
AIC Recruitment 2021: న్యూఢిల్లిలో ఉన్న అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ).. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఐసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న..
AIC Recruitment 2021: న్యూఢిల్లిలో ఉన్న అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ).. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఐసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏడాది కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా క్లస్టర్ హెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ/డిప్లొమా(అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్)/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* సంబంధిత విభాగాలో కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 05-12-2021తో ముగియనుంది.
* నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: ఈ క్యాప్ రంగులను గుర్తుపట్టగలరా.. సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్న కలర్ చూసింగ్..
Anand Mahindra: నేను అలా అనలేదు.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా..