TSPSC: రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు ఖరారు.. ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

ర‌ద్దు చేసిన ఏఈఈ నియామ‌క ప‌రీక్ష‌ల తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. మే 8వ తేదీన ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ పోస్టుల‌కు, 9న అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు

TSPSC: రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు ఖరారు.. ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ
TSPSC
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 29, 2023 | 9:02 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక ప్రకటన చేసింది. పేపర్‌ లీకేజీ కారణంగా రద్దు చేసిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ర‌ద్దు చేసిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసిందిటీఎస్‌పీఎస్‌సీ. తాజాగా నియామక పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో, సివిల్ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇదిలావుంటే, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో మరిన్ని వివరాలు రాబడుతుంది. నిందితుడు ప్రవీణ్.. తన కోసమే గ్రూప్ -1 పేపర్ కొట్టేసినట్లు సిట్ విచారణలో తేలింది. తనకు పరిచయం ఉన్న ముగ్గురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ఇచ్చినట్లు విచారణలో చెప్పినట్లుతెలుస్తుంది. గ్రూప్ -1 పేపర్ కేవలం ఐదుగురికి మాత్రమే చేరినట్లు సిట్ ఆధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు 100మార్కులు సాధించిన వారిలో 84మందిని విచారించారు సిట్ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!