10th Class: 10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టిక్కెట్ ఉంటే ఫ్రీ జర్నీ.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..
ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై, ఏర్పాట్ల విషయంపై మంత్రి బొత్సా సత్యనారాయణ , విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, పోలీసులు, వైద్య శాఖ, తపాలా, ఆర్టీసీ అధికారులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలనీ.. బస్సులను తగిన సంఖ్యలో నడపాలని పేర్కొన్నారు.
ఉచిత ప్రయాణ సౌకర్యం..
2022-2023 ఏడాదికి గాను రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు 6.15 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. పరీక్షలు రాయనున్న స్టూడేంట్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షాకేంద్రాలకు స్టూడెంట్స్ వెళ్ళడానికి వీలుగా ఆర్టీసీ వీలైనంత ఎక్కువగా బస్సులను నడపాలని కోరారు. అంతేకాదు హాల్ టికెట్ చూపించే టెన్త్ స్టూడెంట్స్ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి బొత్స.
అంతేకాదు పరీక్ష కేంద్రాల వద్ద స్టూడెంట్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలనీ కోరారు. ప్రాధమిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మంత్రి బొత్సా..
పరీక్ష కేంద్రాలకు ఈ వస్తువులకు అనుమతి లేదు..
రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ టెన్త్ పరీక్ష ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఆర్డీఓలు పరీక్ష కేంద్రాలను రోజూ సందర్శించాలని సూచించారు. ఏర్పాట్లలో ఏమైనా లోటుపాట్లు ఉంటె వెంటనే సరిదిద్దాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే పదవ తరగతి స్టూడెంట్స్ పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..