AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Telugu University Admissions: ఏపీకి కొత్త తెలుగు యూవర్సిటీ వచ్చేసిందోచ్.. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విద్యాత్మక కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభిం చనున్నామని వర్సిటీ ఇన్ఛార్జి ఉపాధ్యక్షులుగా నియమితులైన ప్రొఫెసర్‌ మునిరత్నం నాయుడు వెల్లడించారు. అక్టోబరు 16న ఆయనను హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం..

AP Telugu University Admissions: ఏపీకి కొత్త తెలుగు యూవర్సిటీ వచ్చేసిందోచ్.. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
AP Potti Sriramulu Telugu University
Srilakshmi C
|

Updated on: Oct 18, 2025 | 3:09 PM

Share

అమరావతి, అక్టోబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విద్యాత్మక కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభిం చనున్నామని వర్సిటీ ఇన్ఛార్జి ఉపాధ్యక్షులుగా నియమితులైన ప్రొఫెసర్‌ మునిరత్నం నాయుడు వెల్లడించారు. అక్టోబరు 16న ఆయనను హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ వెలుదండ నిత్యానందరావు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం ప్రవేశాలు జరపలేదని, ఈ విద్యాసంవత్సరం త్వరలోనే ప్రవేశాలు నిర్వహించి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. రాజమహేంద్రవరంలో తెలుగు వర్సిటీ, ఏలూరు జిల్లాలో అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యకలాపాలు మొదలవుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌లో స్థాపించబడిన తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గతేడాది జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తయింది. దీంతో ఈ రెండు యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించడం నిలిపివేశాయి. ఈ క్రమంలో ఏపీ రాష్ట్రంలో కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏలూరు జిల్లాలో రెండు ప్రాంతాల్లో భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. భవనాలు సిద్ధమయ్యే వరకు వర్సిటీలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి, ప్రవేశాలు నిర్వహించనున్నారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌) సీబీటీ 2 ప్రాథమిక కీ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల సీబీటీ 2 పరీక్షల ప్రాథమిక కీని రైల్వే బోర్డు తాజాగా విడుదల చేసింది. సెకండ్‌ స్టేజ్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్ష అక్టోబర్‌ 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి కీ, రెస్పాన్స్‌షీట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 23 వరకు కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. కాగా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ కింద మొత్తం 8,113 రైల్వే ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌) సీబీటీ 2 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.