AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. రెండోసారి ఎంప్లాయిస్‌ని తొలగించేందుకు సిద్ధమైన టెక్‌ దిగ్గజం.

ఉద్యోగాల తొలగింపు అంశం గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలు...

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. రెండోసారి ఎంప్లాయిస్‌ని తొలగించేందుకు సిద్ధమైన టెక్‌ దిగ్గజం.
Layoffs
Narender Vaitla
|

Updated on: Mar 07, 2023 | 2:44 PM

Share

ఉద్యోగాల తొలగింపు అంశం గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలు కాస్త తగ్గాయని అందరు సంతోషించేలోపే ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా మరో బాంబ్‌ పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్‌ దిగ్గజం మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11,000 మందిని తొలగించిన మెటా తాజాగా మరో 1000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అవసరం లేని టీమ్‌లను తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం. ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గడంతో ఆర్థిక లక్ష్యాలను మెటా చేరుకోలేకపోతోంది. ఈ కారణంతోనే మరోసారి ఉద్యోగుల తొలగింపునకు ఆ సంస్థ సిద్ధమైందని సంబంధింత వర్గాలు వెల్లడించినట్టు బ్లూమ్‍బర్గ్ పేర్కొంది. ఉద్యోగం నుంచి తొలగించే అభ్యర్థుల జాబితాను తయరా చేయాలని ఇప్పటికే వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్లను మెటా కోరినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఓవైపు ఉద్యోగులను తొలగిస్తున్న మెటా మరోవైపు వర్చువల్‌ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. ఇందుకోసం మెటా భారీగా ఖర్చు చేస్తోంది. అయితే దీని ద్వారా ఆదయం ఇప్పట్లో రాలేని పరిస్థితి. ఇందులో భాగంగానే మెటా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఉద్యోగుల తొలగింపు మెటాతో ఆగిపోతాయా.? మరికొన్ని కంపెనీలకు చేరుతాయా చూడాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌