ఇంటర్ విద్యనందించడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం.. కేవలం 10 శాతం మందికే ఆన్‌లైన్ విద్య: సర్వే

ప్రతి నలుగురు విద్యార్ధుల్లో ఒకరు డ్రాప్‌ఔట్.. గత రెండేళ్లలో ఇంటర్ విద్యాసంస్థల్లో 25 శాతం మంది విద్యార్ధులు చదువుకు దూరంకాగా, మరో 20 శాతం మంది బాలికలకు తల్లిదండ్రులు వివాహాలు చేసినట్టు తాజా సర్వేలో బయటపడింది.

ఇంటర్ విద్యనందించడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం.. కేవలం 10 శాతం మందికే ఆన్‌లైన్ విద్య: సర్వే
Inter Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2022 | 9:08 AM

Many students in Telangana had to drop out to earn for their financial crises-hit families: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనమై అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫలితంగా ఎంతో మంది విద్యార్ధులు చదువుమాని, బాల కార్మికులు (child labour)గా మారారు. మరోవైపు విద్యను కొనసాగించడానికి ఆన్‌లైన్ (online education) విధానం ముందుకు రావడంతో సరైన సౌకర్యాలు లేక గత రెండేళ్లలో ఇంటర్ విద్యాసంస్థల్లో 25 శాతం మంది విద్యార్ధులు చదువుకు దూరంకాగా, మరో 20 శాతం మంది బాలికలకు తల్లిదండ్రులు వివాహాలు చేసినట్టు తాజా సర్వేలో బయటపడింది. ప్రతి నలుగురు ఇంటర్ విద్యార్ధుల్లో 1 డ్రాప్‌ఔట్ (dropped out students)అవుతున్నారని, ఆన్‌లైన్ విద్య, ఫిజికల్ క్లాస్‌లలో తరచుగా బ్రేక్‌ల కారణంగా విద్యార్థులు చదువుపై ఆసక్తిని కోల్పోతున్నట్లు సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TPJMA) ప్రెసిడెంట్ గౌరీ సతీష్ తెలిపారు.

వీరిలో చాలా మంది విద్యార్థుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభం (financial crises)కారణంగా.. పిల్లలను చదువుమాన్పించి సంపాదనకు కుదిర్చినట్లు సర్వేలో ఉపాధ్యాయులు తెలిపారు. చెడు అలవాట్లకు బానసలై విద్యార్థులు, దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక పాఠశాల విద్యార్థులకు TSAT ఛానెల్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను అందించిన ప్రభుత్వం.. ఇంటర్మీడియట్ విద్యార్థులను (Telangana Intermediate students) పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక్క ఆర్డర్ కూడా ఇంతవరకు రాలేదని సతీష్ పేర్కొన్నారు. ఈ సర్వేలో మరిన్ని విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..

దాదాపు 9.4 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్రంలో ఉండగా, వీరిలో 10 శాతం మంది మాత్రమే ప్రైవేట్ కళాశాలల్లో ఆన్‌లైన్ విధానంలో చదువుకొంటున్నారు. మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో వారు చదువుమాని కుటుంబాలకు చేదోడువాదోడుగా ఏదోఒకపనిలో చేరుతున్నారు. ముఖ్యంగా తక్కువ-ఆదాయ వర్గాలకు జీవనోపాధి పెద్ద సవాలుగా మారినందున చాలా మంది విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను (part time jobs) ఎంచుకుంటున్నారు. చాలా కాలేజీలు విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించలేకపోయాయి. ఇక ఉపాధ్యాయులు కూడా జీతాలులేక కూరగాయలు అమ్మడం వంటి కూలిపనులకు కూడా వెళ్తున్నారు.

ప్రభుత్వంనుంచి ఎటువంటి సహాయం అందలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది చాలా క్లిష్టమైన సమయం. వారి భవిష్యత్తుకోసం మరిన్ని క్లాసులు నిర్వహించవల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలబస్‌లో చాలా వెనుకబడి ఉన్నారని ఒక ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్‌లైన్ విద్య గురంచి ఓ విద్యార్ధిని మాట్లాడుతూ..

ఆన్‌లైన్ క్లాసులను అర్థం చేసుకోవడం మాకు మానసికంగా సవాలుగా మారింది. కనీసం స్నేహితుల దగ్గరకైనా వెళ్లి చదువుకోవడానికి కోవిడ్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రస్తుతం మేము కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం. ఫిజికల్ క్లాసులకు హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నమని విద్యార్ధిని తెల్పింది.

Also Read:

Indian Army Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో 47 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!