AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZOHO Pay: జోహో పేమెంట్ యాప్ వచ్చేస్తోంది! యూపీఐ యాప్స్‌ను తలదన్నేలా ఫీచర్లు!

అరట్టై మెసేజింగ్ యాప్‌తో సంచలనం సృష్టించిన జోహో సంస్థ.. త్వరలోనే కొత్త యూపీఐ పేమెంట్ యాప్‌ను లాంచ్ చేయనుంది. ‘జోహో పే’ పేరుతో రాబోతున్న ఈ యాప్.. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి ప్రముఖ యూపీఐ యాప్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ యాప్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ZOHO Pay: జోహో పేమెంట్ యాప్ వచ్చేస్తోంది! యూపీఐ యాప్స్‌ను తలదన్నేలా ఫీచర్లు!
Zoho Pay
Nikhil
|

Updated on: Oct 26, 2025 | 3:13 PM

Share

స్వదేశీ టెక్నాలజీ సంస్థగా పాపులర్ అవుతున్న జోహో కంపెనీ ఇటీవల అరట్టై యాప్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ త్వరలోనే కొత్త యూపీఐ యాప్ ను కూడా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ యాప్స్ కంటే మెరుగైన ఫీచర్లు ఈ యాప్‌లో ఉండబోతున్నాయని టాక్.  మరి ఈ యాప్ ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టంట్ పేమెంట్స్‌

జోహో కార్ప్‌కు సంబంధించిన ‘జోహో పే  (Zoho Pay)’ యాప్.. యూపీఐ ఆధారిత పేమెంట్ల కోసం డిజైన్ చేసిన యాప్. ఇది కూడా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ లాగానే  పనిచేస్తుంది. ఇందులో డబ్బు సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, బిల్లులు చెల్లించడం, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేయడం వంటి ఫీచర్లు ఉంటాయి. వీటితోపాటు ఇందులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. పెమెంట్ చేసే టైంను మరింత తగ్గించేలా ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే అరట్టై యాప్‌తో జోహో పే ను  లింక్ చేసుకుని ఫ్రెండ్స్‌కు ఈజీగా పేమెంట్స్ చేసేలా ఆప్షన్ ఉండబోతోందట.

లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతానికి, జోహో పే యాప్ లాంచ్ తేదీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, అత్యంత త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. జోహో సంస్థ  ఇప్పటికే పేమెంట్-అగ్రిగేటర్ లైసెన్స్‌ కలిగి ఉంది. జోహో బిజినెస్ ద్వారా మర్చంట్ పేమెంట్లను కూడా అందిస్తుంది. త్వరలోనే యూపీఐ పేమెంట్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.  ప్రస్తుతానికి, ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. 2026 మొదట్లో ఈ యాప్‌ అందుబాటులోకి రావొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..