Pension Scheme: కేవలం రూ.210 డిపాజిట్‌తో రూ.5000 పెన్షన్.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. మోడీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. మీరు రూ. 210 డిపాజిట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టే పెట్టుబడిదారులు పదవీ విరమణ వయస్సు తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ మొత్తాన్ని పొందుతారు..
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. మోడీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. మీరు రూ. 210 డిపాజిట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టే పెట్టుబడిదారులు పదవీ విరమణ వయస్సు తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ మొత్తాన్ని నెలవారీగా ఇస్తారు. మీరు పెట్టే పెట్టుబడులను బట్టి పెన్షన్ పథకం కింద మొత్తం నిర్ణయించబడుతుంది.
18 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి:
అటల్ పెన్షన్ యోజన (APY) కింద ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాని 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులందరూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత కస్టమర్‌లు స్కీమ్‌లో చేరిన తర్వాత కస్టమర్ చేసిన విరాళాలపై ఆధారపడి, 60 ఏళ్లు నిండిన తర్వాత కస్టమర్‌లు రూ.1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000 లేదా రూ. 5000 కనీస నెలవారీ పెన్షన్‌ను పొందుతారు.
రూ.5000 చిన్న పెట్టుబడి:
మీకు 18 ఏళ్లు ఉంటే 60 ఏళ్ల వయస్సులో మీరు రూ. 5000 పెన్షన్ ఫండ్ కోసం రూ. 210 పెట్టుబడి పెట్టాలి. మీ వయసు పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తం కూడా పెరుగుతుంది. దీని కింద చందాదారునికి నెలవారీ పెన్షన్ ఇవ్వబడుతుంది. ఆపై అతని/ఆమె జీవిత భాగస్వామికి ఆపై వారిద్దరూ మరణించిన తర్వాత, చందాదారుని 60 సంవత్సరాల వయస్సులో సేకరించిన పెన్షన్ మొత్తాన్ని నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. చందాదారుడు ఒక వేళ అకాల మరణం చెందితే (60 ఏళ్లలోపు మరణిస్తే), అసలు చందాదారుడికి 60 ఏళ్లు నిండే వరకు, సబ్‌స్క్రైబర్ జీవిత భాగస్వామి మిగిలిన వ్యవధిలో చందాదారుని ఏపీవై ఖాతాకు విరాళాన్ని అందించడం కొనసాగించవచ్చు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు వారి భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చొరవ. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) మొత్తం అడ్మినిస్ట్రేటివ్, ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ క్రింద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)చే నిర్వహించబడుతుంది. అయితే పెన్షన్ పొందేందుకు నెలవారీ డిపాజిట్ మీ వయసును బట్టి ఉంటుందని గుర్తించుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి