Yamaha: బైక్ కొనేవారికి బంపర్ ఆఫర్.. ఇప్పుడు మిస్ అయ్యారంటే అంతే.. భారీగా తగ్గించిన యమహా!
Yamaha Bikes: ప్రస్తుతం 28 శాతం ఉన్న పన్ను స్థానంలో 18 శాతం పన్ను మాత్రమే విధించనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యమహా వాహనాల ధరలు రూ.17,581 వరకు తగ్గుతాయి. ఈ ధరల తగ్గింపుతో కస్టమర్లు వివిధ..

Yamaha: మోటార్ సైకిళ్ళు, స్కూటర్లపై ఇటీవల GST తగ్గింపు తర్వాత ఇండియా యమహా మోటార్ తన ద్విచక్ర వాహనాల పోర్ట్‌ఫోలియో అంతటా ధరల సవరణలు చేసింది. సవరించిన ధర 22 సెప్టెంబర్, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఎంట్రీ-లెవల్, ప్రీమియం విభాగాలలో డిమాండ్‌ను పెంచడానికి రాబోయే పండుగ సీజన్‌కు ముందు కంపెనీ ఈ సవరణలను ప్రకటించింది.
సూపర్‌స్పోర్ట్ యమహా R15 అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది. దీని ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,12,020 నుండి రూ. 1,94,439కి తగ్గింది, రూ. 17,581 తగ్గింది. నేకెడ్ MT15 కూడా రూ. 14,964 ప్రయోజనాన్ని పొందుతుంది. దీని ధర రూ. 1,65,536కి తగ్గింది. FZ-S Fi హైబ్రిడ్, FZ-X హైబ్రిడ్‌తో సహా FZ శ్రేణి ఇప్పుడు వరుసగా రూ. 1,33,159, రూ.1,37,560గా ఉంది. రూ. 12,031, రూ.12,430 తగ్గించింది కంపెనీ. స్కూటర్ విభాగాన్ని పరిశీలిస్తే, ఏరోక్స్ 155 వెర్షన్ S ధర ఇప్పుడు రూ. 12,753 తగ్గి రూ. 1,41,137కి చేరుకుంది. RayZR ధర రూ. 7,759 తగ్గుదలతో రూ. 86,001కి తగ్గగా, ఫాసినో ధర ఇప్పుడు రూ. 8,509 తగ్గుదల తర్వాత రూ. 94,281కి అందుబాటులో ఉంటుంది. కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు 22 సెప్టెంబర్, 2025 నుండి అమలులోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: Viral Video: వేదికపై పాట పడుతుండగా ఏం జరిగిందో చూడండి.. క్షణాల్లోనే జరిగిపోయింది.. షాకింగ్ వీడియో
యమహా R3, MT-03 ధరలను సుమారు రూ. 30,000 వరకు తగ్గించనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. అయితే వివిధ మోడళ్లను బట్టి ధర తగ్గింపు ఉండనుంది. ప్రస్తుతం, R3 ధర రూ. 3.60 లక్షలు, MT-03 ధర రూ. 3.50 లక్షలు ఉంది. ముఖ్యంగా 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లు, స్కూటర్లపై ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం 28 శాతం ఉన్న పన్ను స్థానంలో 18 శాతం పన్ను మాత్రమే విధించనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యమహా వాహనాల ధరలు రూ.17,581 వరకు తగ్గుతాయి. ఈ ధరల తగ్గింపుతో కస్టమర్లు వివిధ యమహా మోడళ్లపై గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Viral Video: నిద్రపోతూ కారు నడిపాడా ఏంటి? ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో రికార్డ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








