AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive Toilet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్.. ధర రూ.88 కోట్లు.. ప్రత్యేకత ఏంటి?

Worlds Most Expensive Toilet: వంబర్ 8న ప్రారంభమైన వేలంలో దీనిని కొనడానికి ధనవంతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బంగారు టాయిలెట్ సీట్‌ పూర్తిగా పనిచేస్తుంది. దీనిని సాధారణ టాయిలెట్ లాగా ఉపయోగించవచ్చు. తరచుగా, కళాఖండాలు అలంకరణ కోసమే. కానీ 'అమెరికా'..

Expensive Toilet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్.. ధర రూ.88 కోట్లు.. ప్రత్యేకత ఏంటి?
Subhash Goud
|

Updated on: Nov 19, 2025 | 5:18 PM

Share

Worlds Most Expensive Toilet: టాయిలెట్ రూమ్స్‌ అనేది ఇంట్లో ముఖ్యమైన భాగం. కానీ ఇక్కడి టాయిలెట్ ధర విలాసవంతమైన భవనం లేదా ప్రైవేట్ జెట్ కంటే ఎక్కువగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది జోక్ కాదు నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కమోడ్‌ (టాయిలెట్ సీట్‌) ఇప్పుడు వేలానికి అందుబాటులో ఉంది. ఇది సాధారణ సీటు కాదు.. స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన, 100 కిలోల బరువున్న ప్రత్యేకమైన టాయిలెట్ సీట్‌.

88 కోట్ల విలువైన టాయిలెట్ సీట్‌:

ఈ టాయిలెట్ సీట్‌ పేరు “అమెరికా”. ఇది ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ సృష్టించిన కళాకృతి పేరు. 18-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. దీని బరువు దాదాపు 101.02 కిలోగ్రాములు (223 పౌండ్లు). ఈ టాయిలెట్ సీట్‌ ప్రారంభ బిడ్ 10 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 88 కోట్లు. నవంబర్ 8న ప్రారంభమైన వేలంలో దీనిని కొనడానికి ధనవంతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బంగారు టాయిలెట్ సీట్‌ పూర్తిగా పనిచేస్తుంది. దీనిని సాధారణ టాయిలెట్ లాగా ఉపయోగించవచ్చు. తరచుగా, కళాఖండాలు అలంకరణ కోసమే. కానీ ‘అమెరికా’ విషయంలో కాదు. సాధారణ టాయిలెట్ సీట్‌లాగా ఉపయోగించవచ్చు. నవంబర్ 8న ప్రారంభమైన వేలంలో దీనిని కొనుగోలు చేయడానికి ధనవంతుల మధ్య తీవ్రమైన పోటీ ప్రారంభమైంది.

కూడా చదవండి: PM Kisan: 21వ విడతకు ముందు 70 లక్షల మంది రైతుల పేర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?

2016లో కాటెలాన్ ఇలాంటివి రెండు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉండగా.. దొంగతనానికి గురైంది. దొంగలు దానిని ప్లంబింగ్ తో పాటు పెకిలించుకుని పారిపోయారు. ఆ టాయిలెంట్ ఇప్పటికీ దొరకలేదు. దానిని దొంగలు కరిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వేలాది వస్తుంది రెండో బంగారం టాయిలెట్.

ఇది కూడా చదవండి: Investment Formula: రూ.50 వేల జీతంతో 2 కోట్లు ఎలా సంపాదించాలి? అద్భుతమైన ఫార్మూలా!

ఇది కూడా చదవండి: Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి