Business Idea: బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ మీకోసం..

కాలంతో పాటు సంబంధం లేకుండా ఎప్పుడూ ఆదాయం వచ్చే వ్యాపారాల్లో వస్త్ర వ్యాపారం ఒకటి. ముఖ్యంగా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారాలకు భలే గిరాకీ ఉంటుంది. దుస్తులపై భారీగా లాభాలు ఆర్జించవచ్చు. రెడీమేడ్‌ దుస్తులు మొత్తం మూడు విభాగాల్లో ఉంటాయి. వీటిలో కిడ్స్‌ వియర్‌, విమెన్‌ వియర్‌, మెన్స్‌ వియర్‌ ప్రాధానమైనవి. అయితే వీటన్నింటినీ ఒకే చోట పెట్టొచ్చు లేదా విడివిడిగా...

Business Idea: బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ మీకోసం..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2024 | 11:54 AM

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు బిజినెస్‌ చేయాలనే ప్లాన్‌లో ఉంటారు. అందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇక వ్యాపారం చేయాలనుకునే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా లభాన్ని ఆశించే మొదలు పెట్టాలని చూస్తారు. కానీ చాలా మంది లాభాలు వస్తాయో రావో, పెట్టుబడి ఎక్కువవుతో ఏమో అనే ఆలోచనలో బిజినెస్ ఆలోచనను విరమించుకుంటారు. అయితే వ్యాపార మార్గాలను అన్వేషిస్తే మాత్రం నష్టాలు అనేవి లేకుండా లాభాలు పొందొచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలంతో పాటు సంబంధం లేకుండా ఎప్పుడూ ఆదాయం వచ్చే వ్యాపారాల్లో వస్త్ర వ్యాపారం ఒకటి. ముఖ్యంగా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారాలకు భలే గిరాకీ ఉంటుంది. దుస్తులపై భారీగా లాభాలు ఆర్జించవచ్చు. రెడీమేడ్‌ దుస్తులు మొత్తం మూడు విభాగాల్లో ఉంటాయి. వీటిలో కిడ్స్‌ వియర్‌, విమెన్‌ వియర్‌, మెన్స్‌ వియర్‌ ప్రాధానమైనవి. అయితే వీటన్నింటినీ ఒకే చోట పెట్టొచ్చు లేదా విడివిడిగా కూడా పెట్టొచ్చు. మీ మార్కెట్‌కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడి తో కూడా ప్రారంభించవచ్చు.

రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారాన్ని కనీసం రూ. లక్షతో ప్రారంభించవచ్చు. అయితే దుస్తులను హోల్‌ సేల్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కొందరు బెంగళూరు, ముంబయి వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇక మరికొందరు ఢిల్లీ నుంచి కూడా దుస్తులను తెప్పించుకుంటారు. దుస్తుల క్వాలిటీ ఆధారంగా కనీసం 30% నుంచి 50% వరకు లాభం ఏటూ పోదూ. ముఖ్యంగా యువతను అట్రాక్ట్‌ చేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త దుస్తులను తీసుకొస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

కొనుగోళ్లు పెంచుకోవాలనుకుంటే ముందుగా మీ వ్యాపారం గురించి బ్రాండింగ్ చేసుకోవాలి. అలాగే సోషల్‌ మీడియా వేదికగా కూడా మీ వ్యాపారానికి సంబంధించి ప్రమోషన్‌ చేసుకోవాలి. ఇక లాభాల విషయానికొస్తే రోజుకు తక్కువలో తక్కువ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు లాభాన్ని ఆర్జించవచ్చు. ఈ లెక్కన మంచి ఏరియాలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు రూ. 60 వేలు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..