Indian Railways: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు
సాధారణంగా రైళ్లలో సీనియర్ సీటిజన్లు లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. రాత్రి పూట ప్రయాణం చేసే వారిలో అప్పర్ బెర్త్‌లో సీటు వస్తే ఇబ్బందులు పడుతుంటారు. దీంతో లోయర్ బెర్త్ సీటు వచ్చిన వారితో ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. అయితే ఇకపై ఈ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధ ప్రయాణికులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్‌కు...
ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటి. ప్రతీ రోజూ లక్షల మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వేస్ తమ గమ్య స్థానాలకు చేరుస్తోంది. తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంలో ఎప్పుడూ ముందుండే రైల్వే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా రైళ్లలో సీనియర్ సీటిజన్లు లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. రాత్రి పూట ప్రయాణం చేసే వారిలో అప్పర్ బెర్త్‌లో సీటు వస్తే ఇబ్బందులు పడుతుంటారు. దీంతో లోయర్ బెర్త్ సీటు వచ్చిన వారితో ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. అయితే ఇకపై ఈ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధ ప్రయాణికులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్‌కు ప్రాధాన్యతనిస్తూ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
రైలు ప్రయాణాల సమయంలో సీనియర్ సిటిజన్‌ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతి అందించడం కోసం లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైన బంధువు కోసం లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయింపుపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు.
ఈ అంశం కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అధికారులు సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్‌లో ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో లోయర్ బెర్త్ కావాలనుకునే వారు లోయర్ బెర్త్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..