Vodafone Idea కంపెనీ మూతపడుతుందా..! కుమార్ మంగళం బిర్లా తన వాటాను ప్రభుత్వానికి అప్పగిస్తున్నాడా..

uppula Raju

uppula Raju |

Updated on: Aug 02, 2021 | 6:44 PM

Vodafone Idea : ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా.. అప్పుల ఊబిలో ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) లో

Vodafone Idea కంపెనీ మూతపడుతుందా..! కుమార్ మంగళం బిర్లా తన వాటాను ప్రభుత్వానికి అప్పగిస్తున్నాడా..
Vodafone Idea

Follow us on

Vodafone Idea : ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా.. అప్పుల ఊబిలో ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) లో తన వాటాలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నాడని తెలిసింది. బిలియనీర్ పారిశ్రామికవేత్తగా ఉన్న బిర్లా.. జూన్‌లో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో ఈ ఆఫర్ ఇచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా రూ .58,254 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాలి. ఇందులో కంపెనీ రూ .7854.37 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.50,399.63 కోట్లు బాకీ ఉంది.

గతంలో వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ కోరుతూ పిటిషన్ వేసింది. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే తమ ఏజీఆర్ బకాయి రూ. 28, 308 కోట్లు మాత్రమేనని, తమ ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగినట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. దీనివల్ల తాము అదనంగా దాదాపు రూ. 24,600 కోట్ల బకాయిలు నిర్ణయించినట్టు వొడాఫోన్ ఐడియా వివరించింది. భారతీ ఎయిర్‌టెల్ కూడా తమ ఏజీఆర్ బకాయిలను మళ్లీ లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఏజీఆర్ బకాయిలు రూ. 43,980 కోట్లుగా ఉండగా, ఇప్పటికే రూ. 18,000 కోట్లను చెల్లించింది. అయితే వారి అప్పీల్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు VIL లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అయితే పెట్టుబడిదారులు కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేరని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) మార్గం ద్వారా రూ .15,000 కోట్ల వరకు పెట్టుబడి కోసం వోడాఫోన్ ఐడియా (VI) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కంపెనీ మునిగిపోయే అంచున ఉంది బిర్లా జూన్ 7 న ఈ లేఖ రాశారు. జూలై నాటికి ఈ మూడు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే VIL ఆర్థిక పరిస్థితి మునిగిపోయే అంచుకు చేరుకుంటుందని ఇక దీనిని నిర్వహించడం కష్టమని ఆయన అన్నారు. వోడాఫోన్ ఐడియా సంబంధం ఉన్న 27 కోట్ల మంది భారతీయుల పట్ల మాకు బాధ్యత ఉంది. వీరిని దృష్టిలో ఉంచుకుని నా వాటాను ప్రభుత్వానికి లేదా అలాంటి ఏదైనా సంస్థకు అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నట్లు కుమార్ మంగళం బిర్లా ప్రకటించారు.

Kondapur Accident: మద్యం మత్తులో యువకుడి ర్యాష్ డ్రైవింగ్… పల్టీలు కొట్టిన కారు, యువతి స్పాట్ డెడ్

IPO listings: మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో నాలుగు కంపెనీలు.. వాటి ధర ఎంత.. ఎలా కొనాలో ఇక్కడ తెలుసుకోండి..

CAT-2021 : క్యాట్ రిజిస్ట్రేషన్ ఈ తేదీ నుంచి ప్రారంభం.. నవంబర్‌లో పరీక్ష

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu