AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Budget 2026: బడ్జెట్‌లో సామాన్యులకు భారీ ఊరట.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..? అవి మాత్రం పెరిగే అవకాశం.. !

ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ఏయే నిర్ణయాలు ఉంటాయనే దానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. జనాలు అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి బడ్జెట్‌తో ఏయే వస్తువుల చవకగా దొరకుకుతాయి.. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి అనేది చర్చనీయాంశంగా మారింది. వాటిపై అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Central Budget 2026: బడ్జెట్‌లో సామాన్యులకు భారీ ఊరట.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..? అవి మాత్రం పెరిగే అవకాశం.. !
Union Budget 2026
Venkatrao Lella
|

Updated on: Jan 29, 2026 | 3:58 PM

Share

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్ధిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఆర్ధిక సర్వేలో మరో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై దేశ ప్రజల్లో అంచనాలు ఆమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సారి బడ్జెట్‌పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం క్రమంలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ కీలకంగా మారింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో బడ్జెట్‌లో పలు పన్ను మినహాయింపులతో పాటు అనేక ఆర్ధిక సంస్కరణలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.

అందరిచూపు వీటిపైనే..

బడ్జెట్ అనగానే అందరిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఏయే వస్తువులు పెరుగుతాయి.. ఏయే వస్తువులు తగ్గుతాయి అనేది చూస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, ట్యాక్స్ మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలు వస్తువుల ధరలపై ప్రభావితం చూస్తాయి. దీంతో బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని పెరుగుతూ ఉంటాయి. దీంతో ఈ సారి బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి.. ఏవేవీ తగ్గుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు, హోమ్ లోన్ ఈఎంఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయి.

ఈ ధరలు తగ్గే అవకాశం

-ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు(జీతం తీసుకునేవారికి చేతికి ఎక్కువ సొమ్ము అందే అవకాశం) -హోమ్ లోన్, ఈఎంఐలు(రుణ ఛార్జీలు తగ్గించే అవకాశం) -ఎలక్ట్రిక్ వెహికల్స్(సబ్సిడీలు మరింత పెంపు) -ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు( దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశం)

ఇవి పెరిగే అవకాశం..

-పెట్రోల్,డీజిల్ ధరలు -కార్లు(ట్యాక్స్‌లు పెంచే అవకాశం) క-న్జ్యూమర్ ప్రోడక్ట్స్

ఇన్‌కమ్ ట్యాక్స్ రిలీఫ్

ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఖచ్చితంగా ఉండనున్నాయి. ఉమ్మడి కుటుంబం ఉన్నవారికి రూ.25 లక్షల వరకు ఆదాయం ట్యాక్స్ ఫ్రీ సౌకర్యం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు రూ.15 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. గత బడ్జెట్‌లో ఈ మేరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. అయితే ఈ సారి అందులో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ఇక వ్యాపారవేత్తలకు ఈ సారి రాయితీలు, ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండనున్నాయి. జీడీపీని వృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వ్యాపార వర్గాలు సబ్సిడీల కోసం ఎదురుచూస్తున్నాయి.

కేంద్ర బడ్జెట్‌పై అప్డేట్.. ఈ వస్తువుల ధరలు తగ్గే అవకాశం..?
కేంద్ర బడ్జెట్‌పై అప్డేట్.. ఈ వస్తువుల ధరలు తగ్గే అవకాశం..?
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. 100% సబ్సిడీతో లోన్స్‌..
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. 100% సబ్సిడీతో లోన్స్‌..
జస్ట్ 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్.. విమానం కంటే వేగంగా..
జస్ట్ 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్.. విమానం కంటే వేగంగా..
నా పాత్ర అస్సలు నచ్చలేదు..కానీ రిజల్ట్ ఊహించలేదు..
నా పాత్ర అస్సలు నచ్చలేదు..కానీ రిజల్ట్ ఊహించలేదు..
Surya Arghyam: సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కలిగే అద్భుత ఫలితాల
Surya Arghyam: సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కలిగే అద్భుత ఫలితాల
కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం తీపికబురు
కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం తీపికబురు
బ్రష్‌ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా? ఆ అలవాటు వల్లేనా?
బ్రష్‌ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా? ఆ అలవాటు వల్లేనా?
ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఈ గ్రామం గురించి తెలుసా
ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఈ గ్రామం గురించి తెలుసా
వెండి విశ్వరూపం.. ఈ టైమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా..?
వెండి విశ్వరూపం.. ఈ టైమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా..?
కలలో చంద్రుడిని చూడటం.. వైవాహిక జీవితానికి శుభమా? అశుభమా?
కలలో చంద్రుడిని చూడటం.. వైవాహిక జీవితానికి శుభమా? అశుభమా?