Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: మార్చి 13 లేదా 14.. బ్యాంకులకు ఏ రోజు సెలవు!

Bank Holidays: ఇప్పుడు హోలీ పండగ వస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మార్చి 13న పండగ జరుపుకొంటుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో మార్చి 14న జరుపు కొంటున్నారు. నిజానికి మార్చి 14న బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈ రెండు తేదీల్లో బ్యాంకులకు ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసుకుందాం..

Bank Holiday: మార్చి 13 లేదా 14.. బ్యాంకులకు ఏ రోజు సెలవు!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 13, 2025 | 4:04 PM

హోలీ సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులు కొన్ని రోజులు మూసి ఉండనున్నాయి. ఈసారి హోలీ సందర్భంగా ప్రాంతీయ ఆచారాలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. మార్చి 13, 2025న హోలిక దహన్ కోసం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, జార్ఖండ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ ఢిల్లీ, ముంబై, ఇతర రాష్ట్రాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచి ఉంటాయి. మార్చి 13, 14 తేదీలలో బ్యాంకులు ఎక్కడ మూసి ఉంటాయో చూద్దాం.

మార్చి 14న హోలీ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

మార్చి 14, 2025న హోలీ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. గుజరాత్, ఒరిస్సా, చండీగఢ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గోవా, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. అదే సమయంలో త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్‌లలో బ్యాంకులు తెరిచి ఉంటాయి.

మార్చి 15న బ్యాంకులు తెరిచి ఉంటాయి:

మార్చి 15, 2025న చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు నెలలో మూడవ శనివారం, శనివారం పనిదినం. త్రిపుర, ఒడిశా, మణిపూర్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మార్చి 15, 2025 న కూడా బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాలు, పండుగలను బట్టి బ్యాంకు సెలవులు మారవచ్చు. అందువల్ల మీ రాష్ట్రంలో బ్యాంకు సెలవులను నిర్ధారించడానికి సంబంధిత బ్యాంకు లేదా RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచిస్తున్నాము. ఆర్‌బిఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం.. మార్చిలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: వ్యాపారులకు షాకివ్వనున్న ప్రభుత్వం.. ఇక UPI, RuPay లావాదేవీలపై ఛార్జీలు!

ఈ తేదీలలో కూడా సెలవు ఉంటుంది:

  • మార్చి 22న బీహార్ దినోత్సవం: ఈ రోజు బీహార్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • షబ్-ఎ-ఖదర్ సందర్భంగా మార్చి 27న జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు.
  • మార్చి 28న జుమాతుల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు.
  • రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా మార్చి 31న బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Jio vs Starlink: ముఖేష్ అంబానీ జియో.. ఎలోన్ మస్క్ స్టార్ లింక్.. వీటిలో ఏది చౌకైనది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి