Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: అక్కడి వాహనదారులకు వార్నింగ్‌.. ఈ తప్పులు చేస్తే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!

Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ రోజురోజుకు కఠినంగా మారుతున్నాయి. వాహనదారులు చేసే తప్పుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు తమ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం..

Traffic Rules: అక్కడి వాహనదారులకు వార్నింగ్‌.. ఈ తప్పులు చేస్తే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2025 | 8:22 PM

మీరు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నివసిస్తుంటే, తరచుగా మీ వాహనంలో ఢిల్లీకి వెళుతుంటే కాస్త జాగ్రత్తగ ఉండాలి. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ల కోసం కొత్త ఆదేశం జారీ చేశారు. దీని కింద మీరు ర్యాష్ డ్రైవింగ్ (అజాగ్రత్తగా లేదా అసురక్షితంగా డ్రైవింగ్ చేయడం) లేదా మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంతో మూడుసార్లు కంటే ఎక్కువసార్లు వాహనం నడుపుతూ పట్టుబడితే మీ లైసెన్స్ రద్దు చేస్తారు. రాజధాని రోడ్లపై పెరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాలను అరికట్టడం, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు:

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత మూడు సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాలు 1.38 లక్షల నుండి 1.68 లక్షలకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖకు ఒక లేఖ రాశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని అభ్యర్థించారు. 2021లో ఢిల్లీలో 1,206 ప్రమాదాల్లో 1,239 మంది మరణించారని పేర్కొన్నారు. 2024లో డిసెంబర్ 15 వరకు 1,431 ప్రమాదాలలో 1,398 మంది మరణించారు. దీని అర్థం 2021లో సగటున రోజుకు ముగ్గురు వ్యక్తులు వాహన ప్రమాదాల్లో మరణించగా, 2024 నాటికి ఈ సంఖ్య రోజుకు నలుగురికి పెరుగుతుంది.

మోటారు వాహనాల చట్టంలో సవరణ

1988లో అమలులోకి వచ్చిన మోటారు వాహనాల చట్టాన్ని 2019లో సవరించారు, చాలా నేరాలకు జరిమానా మొత్తాన్ని దాదాపు రూ. 100 నుండి ప్రస్తుత శ్రేణి రూ. 500- రూ. 20,000కి పెంచారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఢిల్లీ రవాణా శాఖకు రాసిన లేఖలో, మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 184 మరియు/లేదా 185ని మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేయబడింది. ఈ విభాగాలు ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు సంబంధించినవి. ఇందులో సిగ్నల్స్‌ జంప్‌ చేయడం, తప్పుడు ఓవర్‌టేక్ చేయడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం వంటి నేరాలు ఉంటాయి. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరించనున్నారు.

ఇది కూడా చదవండి: Jio vs Starlink: ముఖేష్ అంబానీ జియో.. ఎలోన్ మస్క్ స్టార్ లింక్.. వీటిలో ఏది చౌకైనది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి