SBI suggestions: ఖాతాల డియాక్టివేషన్ నిబంధనలు మారతాయా..? బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు

దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఇటీవల కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. అన్ని పనులు ఆన్ లైన్ లో సులువుగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలను ఇంటి నుంచే చాలా వేగంగా చేసుకునే వీలు కలిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా బ్యాంకు ఖాతా చాలా అవసరం.

SBI suggestions: ఖాతాల డియాక్టివేషన్ నిబంధనలు మారతాయా..? బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు
Follow us
Srinu

|

Updated on: Dec 10, 2024 | 5:15 PM

చాలా మంది తమ అవసరాల కోసం బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తారు. ఒకటి, రెండు స్లారు లావాదేవీలు జరిపి వదిలేస్తారు. ఇక వాటిని పట్టించుకోవడంతో డియాక్టివ్ అయిపోతాయి. అయితే ఈ డియాక్టివ్ నిబంధనలలో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) సూచనలు, సలహాల మేరకు బ్యాంకులు తమ కార్యకలాపాలు జరుపుతాయి. వడ్డీ రేట్ల విధింపు, డిపాజిట్ల సేకరణ తదితర విషయాన్ని ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. బ్యాంకుల నిబంధనల్లో వచ్చే మార్పులకు ఆర్బీఐ నిర్ణయాలే ఆధారమవుతాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల డియాక్టివేషన్ కు సంబంధించి ప్రస్తుత నిబంధనలను మార్చాలని కోరుతూ ఆర్బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఫారసులు చేసింది. బ్యాలెన్స్ విచారణ తదితర ఆర్థికేతర కార్యకలాపాలు సైతం ఖాాతాను యాక్టివేట్ గా ఉంచడానికి సరిపోయేలా పరిగణించాలని కోరింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీఎస్ శెట్టి ఇటీవల మాట్లాడుతూ ప్రభుత్వం సహాయం కోసం ఖాతాను తెరిచే వారిలో చాలామంది పరిమితంగానే ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నారు. ఖాతాను ప్రారంభించిన తర్వాత కొన్నిసార్లు మాత్రమే నిధులను ఉపసంహరించుకుంటారన్నారు. నిర్ణీత కాలంలో లావాదేవీలు జరగకపోవడం వల్ల ఈ ఖాతాలు డీయాక్టివ్ అవుతున్నాయన్నారు. దీని వల్ల పలు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక లావాదేవీలు జరగకపోయినా ఆర్థికేతర చర్యలు అంటే ఖాతా తనిఖీ వంటివి జరుగుతుంటే వాటిని కొనసాగించాలన్నారు. ఈ మేరకు నిబంధరలను మార్పు చేయాలని ఆర్బీఐని కోరారు.

ఎస్బీఐ సిఫారసులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. స్తంభింపజేసిన ఖాతాలను సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరింది. దీంతో బ్యాంకులన్నీ ఆ మేరకు చర్యలు తీసుకున్నాయి. ఎస్బీఐ కూడా వెంటనే రంగంలోకి దిగింది. అయితే ఇలాంటి డియాక్టివ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా తెలపలేదు. ఎక్కువ కాలం పాటు ఆర్థిక లావాదేవీలు జరగని ఖాతాలను క్రియారహిత ఖాతాలు ఉంటారు. కొందరు కస్టమర్లు తమ ఖాతాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం కొంతకాలానికి ఇవి డియాక్టివ్ అవుతాయి. అనంతరం వాటిలో ఉన్న నగదును తీసుకునే, జమ చేసుకునే అవకాశం ఖాతాదారులకు ఉండదు. వీటిపై ప్రస్తుతం ఆర్బీఐ కొత్తగా చర్యలు తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి