Aadhaar Update: ఆధార్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇంకా 4 రోజులే సమయం!

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ సౌకర్యం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆధార్ కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆధార్ కార్డ్‌లో ఎలాంటి అప్‌డేట్ కావాలన్నా నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలో కొన్ని అప్‌డేట్‌లు..

Aadhaar Update: ఆధార్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇంకా 4 రోజులే సమయం!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2024 | 3:28 PM

ఆధార్ కార్డ్ హోల్డర్లకు కీలక అలర్ట్‌.మీరు ఇంకా మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకుంటే దాన్ని త్వరగా పూర్తి చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఆధార్‌ అప్‌డేట్‌ చేసేందుకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు. ఈ గడువు డిసెంబర్‌ 14 వరకు మాత్రమే గడువు. ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ అప్‌డేట్‌ కోసం గతంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువును 14 డిసెంబర్ 2024 వరకు పొడిగించింది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: UPI Rules: యూపీఐ ట్రాన్సాక్షన్.. జనవరి 1 నుంచి కీలక మార్పులు.. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ!

10 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్‌లో ఏమైనా మార్పులు ఉంటాయన్న ఉద్దేశంతో పూర్తి సమాచారం కోసం యూఐడీఏఐ ఈ అప్‌డేట్‌ ప్రక్రియను తీసుకువచ్చింది. మీరు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వెంటనే ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది. గతంలో ఇది 14 మార్చి నుండి 14 జూన్ 2024 వరకు పొడిగించగా, చివరి తేదీని మరోసారి సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. దీని తరువాత, దానికి మరో డిసెంబర్ 14 వరకు పొడిగించింది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి

  • https://uidai.gov.in/ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి.
  • ఇప్పుడు హోమ్‌పేజీలో కనిపించే My Aadhaar పోర్టల్‌కి వెళ్లండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఉపయోగించి ఇక్కడ లాగిన్ చేయండి.
  • ఇప్పుడు మీ వివరాలను తనిఖీ చేయండి. అది సరైనది అయితే, సరైనట్లు బాక్స్‌లో టిక్ చేయండి.
  • జనాభా సమాచారం తప్పుగా ఉంటే, డ్రాప్-డౌన్ మెను నుండి గుర్తింపు పత్రాన్ని ఎంచుకోండి.
  • ఆపై పత్రాన్ని అప్‌లోడ్ చేయండి. ఈ పత్రాన్ని JPEG, PNG, PDF రూపంలో అప్‌లోడ్ చేయవచ్చు.

ఈ అప్‌డేట్‌ కోసం మీరు కేంద్రానికి వెళ్లాలి

ఉచిత ఆధార్ అప్‌డేట్ సౌకర్యం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆధార్ కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆధార్ కార్డ్‌లో ఎలాంటి అప్‌డేట్ కావాలన్నా నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలో కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయని గుర్తుంచుకోండి. వీటిని ఆన్‌లైన్‌లో కాకుండా కేంద్రానికి వెళ్లడం ద్వారా చేయాల్సి ఉంటుంది. వీటిలో ఐరిస్ లేదా బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాల్సి వస్తే మీరు తప్పకుండా ఆధార్‌ కేంద్రానికే వెళ్లాలి.

గడువు ముగిసిన తర్వాత ఛార్జీ:

డిసెంబర్‌ 14 తర్వాత ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకున్నట్లయితే రూ. 50 ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అయితే ఈ ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ అనేది myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Christmas Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి