CIBIL Score: సామాన్యుడి పాలిట గుదిబండలా మారిన సిబిల్ స్కోర్.? చిత్రగుప్తుడి చిట్టాకంటే దారుణం.!

CIBIL Score: సామాన్యుడి పాలిట గుదిబండలా మారిన సిబిల్ స్కోర్.? చిత్రగుప్తుడి చిట్టాకంటే దారుణం.!

Anil kumar poka

|

Updated on: Dec 10, 2024 | 4:07 PM

ఇది.. సాక్షాత్తు ఓ ఎంపీ యావత్ భారత ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తున్న సిబల్ స్కోర్ గురించి లేవనెత్తిన సందేహాలు. ఆయన మాటలు విన్న తర్వాత సగటు భారతీయుల జీవితాలకు ఈ సిబిల్ స్కోర్ ఎంతటి గుదిబండగా తయారైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ తర్వాత కోట్లాది మంది జీవితాలు తలకిందులైపోయాయి. అదే సమయంలో తీసుకున్న రుణాలకు గడువు తేదీలోగా ఈఎంఐలు కట్టకపోవడం..

నిజానికి కార్తీ చిదంబరం చెప్పినట్టు ఈ సిబిల్ అనే బ్రహ్మ పదార్థం ఎలా అప్ డేట్ అవుతుంది.. ఎన్నాళ్లకు అప్ డేట్ అవుతుంది.. అసలు అప్ డేట్ అవుతుందా..లేదా ఈ విషయంలో సామాన్యులకు క్లారిటీ ఉండానుకోవడం కాస్త కష్టమైన విషయమే. అంతే కాదు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ సిబిల్‌ స్కోర్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థపై విశ్వసనీయతకు సంబంధించిన సందేహాలు కూడా లేవనెత్తారు. దీంతో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ వ్యవహారంపై మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య‌. ఇది 300 నుంచి 900 వర‌కు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్‌ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్‌లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్‌ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.

సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్‌ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్‌ ఉ‍న్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్‌ ఇస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Dec 10, 2024 04:01 PM