Earthquake: భూకంపాలు ఇక రావా.? మనం ధైర్యంగా ఉండొచ్చా.?

Earthquake: భూకంపాలు ఇక రావా.? మనం ధైర్యంగా ఉండొచ్చా.?

Anil kumar poka

|

Updated on: Dec 10, 2024 | 4:27 PM

ఉదయం 7.27AM. ప్రజలు బిజీగా ఉండే సమయం. పిల్లలు స్కూల్స్‌ రెడీ అయ్యే హడావుడి. తల్లిదండ్రులు తమ దిచనర్యల్లో నిమగ్నమైన వేళ. ఒక్కసారిగా అలజడి. ఇల్లంతా ఊగిపోవడం.. వస్తువులు కిందపడటం. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో తలియని పరిస్థితి. భయంతో కొందరు ఇళ్లనుంచి పరుగులు తీశారు. ఉన్నట్టుండి భూమి షేక్‌ కావడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి షేక్‌ చేసిన స్పాట్‌ ములుగు.. తెలంగాణలోని ములుగు.. సమ్మక్క సారక్క అమ్మవార్లు కొలువుదీరిన ప్రాంతం.. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే వైబ్రేషన్‌ స్టార్ట్‌ అయింది. భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

బుధవారం ఉదయం 7:27 గంటల ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. భూకంప కేంద్రం ములుగు ప్రాంతంలో 40 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది.

వరదలైనా.. భీకర గాలులైనా.. సుడిగుండాలైనా.. భూకంపాలైనా… ములుగు జిల్లాలోనే జరుగుతున్నాయి. అసలు ములుగులో అసలేం జరుగుతుంది..? మొన్న వరదలు.. నిన్న బీకార గాలులు, ఇవాళ ఏకంగా భూకంపం. ఇవి మహా విపత్తుకు ముందు హెచ్చరికేనా..?

ములుగు కేంద్రంగా జరిగిన మూడు ప్రకృతి వైపరిత్యాలను ఒక్కసారి పరిశీలిస్తే…
2023 జూలై 30వ తేదీన జంపన్న వాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని నిండా ముంచింది. ఎనిమిది ప్రాణాలను బలి తీసుకుంది.
2024 సెప్టెంబర్ 1వ తేదీన జరిగిన మహా విధ్వంసం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. అదే మేడారం అడవుల్లో చెలరేగిన భీకర గాలుల బీభత్సం.
ఈ విధ్వంసంలో మేడారం అభయరణ్యం దాదాపు 50% తుడిచిపెట్టుకు పోయింది. ఈ విధ్వంసానికి కారణాలపై నెల రోజులపాటు మేదో మధనం చేసిన ఖగోళ భూగోళ శాస్త్రవేత్తలు… స్క్వాల్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు. ఆ గాలుల బీభత్సం నుంచి తేరుకోకముందే ఇప్పుడు భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదు అయింది. భూకంపం సంభవించిన 30 నిమిషాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు విస్తరించింది.

 

అసలు ములుగు కేంద్రం భూకంపం ఎందుకు వచ్చిందో నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. వాటిని వన్ బై వన్ చూద్దాం.
1. ఈ భూకంపం రావడానికి ముందు.. బలమైన సంకేతం ఒకటి ఇచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ములుగు జిల్లా మేడారంలో బీభత్సమైన గాలులకు దాదాపు 50వేల చెట్లు నేలకొరిగాయి. అక్కడే ఈ బీభత్సం ఎందుకు జరిగిందంటే.. ఆ ప్రాంతంలో వాతావరణంలో జరుగుతున్న మార్పులు, స్క్వాల్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు.

2. ములుగు, భూపాలపల్లి ప్రాంతంలో.. సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ, అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి.

3. నదీ పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. ములుగు మాత్రమే కాకుండా.. తెలంగాణ అంతటా.. భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో.. భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే ముగులు తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అని అంటున్నారు.

4. భూమి లోపల పొరల్లో జరిగే కొన్ని సర్దుబాటు కారణాలతో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేతలు చెబుతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇంతకాలం కేవలం వరదలు మినహా ఇతర ఏ ప్రకృతి విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి కావు. కానీ ఇప్పుడు భూకంపాలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చింది స్వల్ప భూకంపమే కాబట్టి సరిపోయింది… భవిష్యత్ లో పెద్ద భూకంపాలు వస్తే ఎలా..? ఇదే ఇప్పుడు ప్రజల్లో భయాన్ని పెంచుతుంది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.