AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్‌ నంబర్‌లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి.. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే!

ప్రస్తుత సాంకేతిక యుగంలో స్కూల్‌కు వెళ్లే బుడ్డోడి నుంచి పండు ముసలోడి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. అదేవిధంగా, ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేక మొబైల్ నంబర్ ఉంటుంది. ఈ మొబైల్‌ నెంబర్‌ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మన ప్రతి గుర్తింపు కార్డులోని మొబైల్‌ నెంబర్‌ కచ్చితంగా అవసరం పడుతుంది. అయితే ఈ మొబైల్‌ నెంబర్‌కు 10 అంకెలలో మాత్రమే ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైన ఆరోచించారా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి

మొబైల్‌ నంబర్‌లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి.. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే!
Indian Mobile Number
Anand T
|

Updated on: Sep 30, 2025 | 12:57 PM

Share

మనకు ఎంతో ముఖ్యమైన మొబైల్‌ నెంబర్‌ గురించి చాలా మందికి తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు మేం మీకు చెప్పబోతున్నాం. మన దేశంలో, మొబైల్ నంబర్లకు సంబంధించిన నియమాలను TRAI (టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా), టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) రూపొందిస్తాయి. మొబైల్ సేవలు ప్రారంభించినప్పుడు, వినియోగదారులను సులభంగా గుర్తించడానికి, నెట్‌వర్క్ నిర్వహణలో ఏవైనా సమస్యలను ఉంటే పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు ఒకే పరిమాణంలో ఉండాలని నిర్ణయించారు. దీని కోసం, 10-అంకెల ఫార్మాట్‌ను తీసుకొచ్చారు.

అయితే ఈ నెంబర్ మొదటి అంకె ఎల్లప్పుడూ 9, 8, 7 లేదా 6 తో మొదలయ్యేట్టు ఏర్పాటు చేశారు. ఈ మొదటి అంకెలు ఆ నంబర్ మొబైల్ నెట్‌వర్క్‌ను చూసిస్తాయి. ఒకసారి మీరు 10 అంకెలను పరిశీలిస్తే, అవి దాదాపు 100 కోట్ల (1 బిలియన్) విభిన్న సంఖ్యల కలయికలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదీ కాకుండా నంబర్‌లో 12 లేదా 13 అంకెలు ఉంటే దాన్ని గుర్తించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.అందుకనే 10 అంకెలు అయితే గుర్తుంచుకోవడం సులభమని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా మన దేశంలో మొబైల్ నంబర్ ముందు +91 ఉంటుంది. ఇది మన దేశ కోడ్‌ను సూచిస్తుంది. ఒక వేళ మీరు ఎవరికైనా అంతర్జాతీయ కాల్ చేయాలనుకుంటే అప్పుడు మీరు మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ముందు +91ని యాడ్‌ చేసి కాల్‌ చేయాలి. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో మొబైల్‌ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి డిజిటల్‌ గుర్తింపుగా మారిపోయింది. అది OTP అయినా, బ్యాంక్ లావాదేవీ నోటిఫికేషన్‌లు అయినా లేదా సోషల్ మీడియా ఖాతా ధృవీకరణ అయినా, ప్రతిదీ దానిపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..