AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: 65వేలు దాటిన బంగారం ధర.. తాజాగా ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా బంగారం ధర రూ.65,000 దాటింది . గత 7 రోజులుగా బంగారం ధరలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే గురువారం MCXలో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 65,525 కొత్త ఇంట్రాడే రికార్డును సృష్టించాయి. బలమైన ప్రపంచ సంకేతాల మధ్య బుధవారం నాడు బంగారం ధర 10 గ్రాములకు రూ.65,178 వద్ద ముగిసింది. అంతెందుకు, బంగారం ధరల్లో ఇంత పెరుగుదల..

Gold Price: 65వేలు దాటిన బంగారం ధర.. తాజాగా ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today
Subhash Goud
|

Updated on: Mar 08, 2024 | 6:34 AM

Share

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా బంగారం ధర రూ.65,000 దాటింది . గత 7 రోజులుగా బంగారం ధరలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే గురువారం MCXలో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 65,525 కొత్త ఇంట్రాడే రికార్డును సృష్టించాయి. బలమైన ప్రపంచ సంకేతాల మధ్య బుధవారం నాడు బంగారం ధర 10 గ్రాములకు రూ.65,178 వద్ద ముగిసింది. అంతెందుకు, బంగారం ధరల్లో ఇంత పెరుగుదల ఎందుకు ఉంది.బంగారం ధరలు ఎంత వరకు చేరుకుంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. అయితే అంతకు ముందు వివిధ ప్రాంతాల్ల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. మార్చి 8వ తేదీన తులం బంగారంపై వంద రూపాయల మేర పెరిగి 65,570 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 60 వేల 910 రూపాయల వరకు చేరుకోగా, 24 క్యారెట్ల ధర 66వేల 450 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 60వేల 260 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర 65 వేల 570 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 60,260 రూపాయల వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర 65 వేల 720 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధరను పరిశీలిస్తే 60 వేల 110 ఉండగా, 24 క్యారెట్ల రేటు 65 వేల, 570 వద్ద ఉంది. ఇక తాజాగా కిలో వెండి ధర 75 వేల 100 రూపాయల వద్ద ఉంది.

బంగారం ధర ఎందుకు ఇంత పెరుగుతోంది?

  • US డాలర్ బలహీనపడటం ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తుంది. అలాగే దాని ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది కాకుండా, US డాలర్ ఇండెక్స్ 5 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
  • అమెరికాలో వడ్డీరేట్లను తగ్గించే అంచనాల కారణంగా కూడా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోందనే చెప్పాలి.
  • భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా పరిగణించబడుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రజలు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
  • ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడంలో బిజీగా ఉన్నాయి. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బంగారం రూ.72,000 దాటనుందా?

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది బంగారం ధరలు బలంగానే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర రూ.72,000 దాటవచ్చు. అటువంటి పరిస్థితిలో, బంగారంలో పెట్టుబడి పెట్టడం మీకు మంచిదని నిరూపించవచ్చు. మీరు మంచి రాబడిని పొందవచ్చు.

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?

దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రభావం బంగారం ధరలపై కూడా కనిపిస్తుంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో బంగారం ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి