AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheque Bounce Rules: చెక్ బౌన్స్‌ కావడానికి కారణాలు ఏమిటి? మీపై బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది!

యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తర్వాత చెక్కు వినియోగం పరిమితం అయిపోయింది. కానీ దాని ఉపయోగం ఇప్పటికీ ముగియలేదు. నేటికీ చాలా మంది చెక్కుల ద్వారానే పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు వచ్చినా చెక్‌లను ఉపయోగించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అదే సమయంలో చాలా మంది చెక్‌లు రద్దు..

Cheque Bounce Rules: చెక్ బౌన్స్‌ కావడానికి కారణాలు ఏమిటి? మీపై బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది!
Cheque Bounce Rules
Subhash Goud
|

Updated on: May 13, 2024 | 5:45 PM

Share

యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తర్వాత చెక్కు వినియోగం పరిమితం అయిపోయింది. కానీ దాని ఉపయోగం ఇప్పటికీ ముగియలేదు. నేటికీ చాలా మంది చెక్కుల ద్వారానే పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు వచ్చినా చెక్‌లను ఉపయోగించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అదే సమయంలో చాలా మంది చెక్‌లు రద్దు అవుతుంటాయి. చెక్‌ లేకుంటే కొందరికి పనులు జరగవు. అయితే, చెక్కు ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు మీ చిన్న పొరపాటు చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉన్నందున దానిని చాలా జాగ్రత్తగా నింపాల్సిన అవసరం ఉంది. బౌన్స్‌ అయిన చెక్కు అంటే ఆ చెక్కు నుండి డబ్బు రావాల్సిన వ్యక్తి దానిని పొందలేకపోతాడు.

బ్యాంకింగ్ భాషలో చెక్ బౌన్స్‌ని డిషనోర్డ్ చెక్ అంటారు. చెక్ బౌన్స్ మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 ప్రకారం.. చెక్ బౌన్స్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే నిబంధన ఉంది. అయితే చెక్‌ బౌన్స్‌ అయితే బ్యాంకులు మొదట ఈ తప్పును సరిదిద్దడానికి మీకు అవకాశం ఇస్తాయి. చెక్కు బౌన్స్ అవడానికి గల కారణాలు, అటువంటి సందర్భంలో ఎంత జరిమానా విధించబడుతుందో, కేసు తలెత్తినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

చెక్ బౌన్స్‌కు ఇవే కారణాలు:

  • ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు
  • సంతకం సరిగ్గా లేకపోవడం
  • స్పెల్లింగ్‌లో తప్పు
  • ఖాతా నంబర్‌లో పొరపాటు
  • చెక్‌ రైటింగ్‌లో తప్పుగా ఉండటం
  • చెక్ జారీచేసేవారి ఖాతాను మూసివేయడం
  • నకిలీ చెక్కు అందించడం
  • చెక్కు మొదలైన వాటిపై కంపెనీ స్టాంపు లేకపోవడం

చెక్ బౌన్స్ తప్పును సరిదిద్దడానికి అవకాశం

మీ చెక్కు బౌన్స్ అయి మీపై కేసు పెట్టడం జరగదు. మీ చెక్కు బౌన్స్ అయినట్లయితే బ్యాంకు ముందుగా దాని గురించి మీకు తెలియజేస్తుంది. దీని తర్వాత మీకు 3 నెలల సమయం ఉంటుంది. దీనిలో మీరు రెండవ చెక్కును రుణదాతకు ఇవ్వవచ్చు. మీ రెండవ చెక్ కూడా బౌన్స్ అయితే, రుణదాత మీపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

చెక్ బౌన్స్‌పై బ్యాంకులు ఎంత జరిమానా వసూలు చేస్తాయి?

చెక్ బౌన్స్ అయితే బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తాయి. చెక్కు జారీ చేసిన వ్యక్తి జరిమానా చెల్లించాలి. కారణాలను బట్టి ఈ జరిమానా మారవచ్చు. ఇందుకోసం ఒక్కో బ్యాంకు ఒక్కో మొత్తాన్ని ఫిక్స్ చేస్తుంది. సాధారణంగా జరిమానా రూ.150 నుండి రూ.750 లేదా 800 వరకు ఉంటుంది.

కేసు ఎప్పుడు వస్తుంది?

మీరు ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాకపోయినా కేసు నమోదు చేయవచ్చు. చెక్ బౌన్స్ అయినప్పుడు బ్యాంకు మొదట రుణదాతకు రసీదుని ఇస్తుంది. అందులో చెక్ బౌన్స్‌కు కారణం వివరిస్తుంది. దీని తర్వాత రుణదాత 30 రోజులలోపు రుణగ్రహీతకు నోటీసు పంపవచ్చు. నోటీసు ఇచ్చిన 15 రోజులలోపు రుణగ్రహీత నుండి స్పందన రాకపోతే రుణదాత కోర్టుకు వెళ్లవచ్చు. రుణదాత ఒక నెలలోపు మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. దీని తరువాత కూడా అతను రుణగ్రహీత నుండి మొత్తం పొందకపోతే అతను అతనిపై కేసు పెట్టవచ్చు. నేరం రుజువైతే, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి