Loan Recovery: లోన్ రికవరీ పేరుతో వేధింపులను ఎదుర్కొవడం ఎలా..?
లోన్ పేమెంట్ కోసం నిర్బంధ చర్యలు తీసుకోరాదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భాల్లో సున్నితత్వాన్ని, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాంకింగ్ రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల చర్యలను తీవ్రంగా విమర్శించింది. కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అన్ని నియంత్రిత సంస్థలు లేదా వాటి రికవరీ ఏజెంట్లు మౌఖిక లేదా భౌతికంగా బెదిరింపులు లేదా వేధింపులను..

చాలా మంది అప్పు ఉచ్చులో చిక్కుకుంటారు. కొన్ని కారణాల వల్ల వారి ఈఎంఐలలో కొన్నింటిని డిపాజిట్ చేయలేకపోతారు. ఆ తర్వాత, రికవరీ ఏజెంట్లు వారిని వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్నిసార్లు, ఏజెంట్లు బెధిరించడం, మరికొన్ని సార్లు వారి ఇంటికి వెళ్లడం చేస్తుంటారు. అలాగే దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది వ్యక్తులు రికవరీ ఏజెంట్ల దౌర్జన్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఏం చెబుతాయి? తెలుసుకుందాం..
లోన్ పేమెంట్ కోసం నిర్బంధ చర్యలు తీసుకోరాదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భాల్లో సున్నితత్వాన్ని, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాంకింగ్ రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల చర్యలను తీవ్రంగా విమర్శించింది. కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అన్ని నియంత్రిత సంస్థలు లేదా వాటి రికవరీ ఏజెంట్లు మౌఖిక లేదా భౌతికంగా బెదిరింపులు లేదా వేధింపులను ఆశ్రయించలేరని ఆర్బీఐ పేర్కొంది. లోన్ రికవరీ కోసం రుణగ్రహీతను ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి. రికవరీ ఏజెంట్లు సోషల్ మీడియా లేదా ఫోన్ ద్వారా ఇష్టం వచ్చినట్టు అభ్యంతరకర మెసేజెస్ పంపలేరు.
ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ, ప్రజలు తమ హక్కుల గురించి తెలియని కారణంగా రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నారు. రికవరీ ఏజెంట్ సమస్యను కలిగిస్తే, మీరు వారి కాల్స్, మెసేజెస్, ఇమెయిల్‌ల రికార్డులను ఉంచాలి. ఇది వారి వేధింపులను నిరూపించడంలో మీకు సహాయం చేస్తుంది. ముందుగా మీరు లోన్ అధికారికి లేదా లెండర్ కు ఫిర్యాదు చేయాలి. అంటే మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీకి అన్నమాట. 30 రోజులలోపు ఫిర్యాదు పరిష్కారం కాకపోతే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ లేదా బ్యాంకింగ్ లోక్‌పాల్‌ను సంప్రదించవచ్చు. ఆర్బీఐ ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థపై cms.rbi.org.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ద్వారా నమోదు అవుతుంది. ఆర్బీఐ బ్యాంకుకు ఆదేశాలు ఇవ్వవచ్చు. అలాగే జరిమానాలు కూడా విధించవచ్చు.




రికవరీ ఏజెంట్ శారీరక హాని, బెదిరించడం లేదా మీ వస్తువులను స్వాధీనం చేసుకోవడం వంటి ఏదైనా చట్టవిరుద్ధమైన చర్య తీసుకుంటే.. తర్వాత రుణగ్రహీత పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. పరిష్కారం లేకపోతే, అతను న్యాయవాది సహాయంతో కోర్టును ఆశ్రయించవచ్చు. రుణగ్రహీత దుష్ప్రవర్తన లేదా వేధింపులకు పరిహారం కోరవచ్చు.
“ఒక రికవరీ ఏజెంట్ మీ పరువు తీసేలా ఏదైనా చేస్తే.. అంటే లోన్ రికవరీ కోసం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదించడం.. మీ ఇరుగుపొరుగు వారి దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలాగే అభ్యంతరకర ఇమేజిలను స్ప్రెడ్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో సదరు బ్యాంక్ అలాగే ఏజెంట్‌పై పరువు నష్టం కేసును ఫైల్ చేసే హక్కు మీకు ఉంది. అదేవిధంగా మీ అనుమతి లేకుండా ఏజెంట్ మీ ప్రాపర్టీలోకి ప్రవేశించినట్లయితే, అతనిపై అతిక్రమణ కేసు నమోదు చేయవచ్చు. మీరు కూడా మీ రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే మీ బ్యాంక్ ఖచ్చితంగా మీ మాట వింటుంది. మీ పరిస్థితిని వివరించడం ద్వారా బ్యాంక్‌తో రుణ చెల్లింపు నిబంధనలను రూపొందించడానికి ప్రయత్నించండి. బాకీ ఉన్న రుణాన్ని తిరిగి పొందేందుకు బ్యాంక్ వెసులుబాటు లేదా రాయితీలను అందించవచ్చు. ఇటువంటి పరిస్థితిని ధైర్యంగా.. విచక్షణతో ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




