Agriculture Loan: మీకు వ్యవసాయం కోసం రుణం కావాలా..? ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోండి!
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ సంబంధిత పనులను పూర్తి చేయడానికి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఇది స్వల్పకాలిక రుణం. దీనికి మీరు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టనవసరం లేదు. దీని వల్ల రైతులకు వ్యవసాయానికి డబ్బు కొరత రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చనేది ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ప్రభుత్వ లక్ష్యం. ఈ మొత్తంపై ప్రభుత్వం రైతుల నుంచి 4 శాతం వడ్డీని వసూలు చేస్తుంది..
దేశంలో ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అటువంటి పథకం గురించి తెలుసుకోండి. ఈ పథకం పేరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ). చాలా సార్లు రైతులకు వ్యవసాయం చేయడానికి ఆర్థిక సహాయం కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ ఖర్చులన్నింటినీ తీర్చుకోవచ్చు. ఈ కార్డు ద్వారా రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా లక్షల్లో రుణాలు అందుతాయి. మీరు కూడా పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే దాని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏమిటి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ సంబంధిత పనులను పూర్తి చేయడానికి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఇది స్వల్పకాలిక రుణం. దీనికి మీరు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టనవసరం లేదు. దీని వల్ల రైతులకు వ్యవసాయానికి డబ్బు కొరత రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చనేది ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ప్రభుత్వ లక్ష్యం.
వడ్డీ రేటు ఎంత..?
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3 లక్షల వరకు గ్యారెంటీ లేని రుణాన్ని పొందుతారు. ఈ మొత్తంపై ప్రభుత్వం రైతుల నుంచి 4 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. నాబార్డ్ సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రారంభించింది. భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. ఇందులో సొంత భూమి, అద్దె భూమి, మౌఖిక కౌలుదారులు, వాటాదారులు మొదలైన అన్ని రకాల రైతులు ఉన్నారు. ఈ స్కీన్‌ను పొందేందుకు కనీస వయస్సు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు ఉండవచ్చు. మరోవైపు రుణ చెల్లింపు గురించి మాట్లాడినట్లయితే.. ఈ వ్యవధి బ్యాంకుల ప్రకారం నిర్ణయించబడుతుంది. సాధారణంగా దీని వ్యవధి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.
పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రైతులు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపి సమర్పించండి. అయితే ఆఫ్‌లైన్ దరఖాస్తు కోసం మీరు మీ సమీప బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను సమర్పించండి.
ఏ పత్రాలు అవసరం:
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- ఓటరు గుర్తింపు కార్డు
- వాహనం లైసెన్స్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- భూమి పత్రాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి