- Telugu News Photo Gallery Indian Railway cheap medicine available at 50 railway station including lucknow patna
Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఈ 50 రైల్వే స్టేషన్లలో తక్కువ ధరలో మందులు
దీంతో రైలులో రోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ చాలా సార్లు రైలులో ప్రయాణంలో ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ప్రజలు మధ్య స్టేషన్‌లో దిగాల్సి వస్తోంది. ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్లలో మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది..
Updated on: Aug 12, 2023 | 2:30 PM

ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రతి నిత్యం లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటూ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. రైలులో టికెట్‌ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నాడు.

దీంతో రైలులో రోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ చాలా సార్లు రైలులో ప్రయాణంలో ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ప్రజలు మధ్య స్టేషన్‌లో దిగాల్సి వస్తోంది.

ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్లలో మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. రైలు ప్రయాణంలో ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే, అతనికి ఇప్పుడు తక్కువ ధరలో మందులు లభిస్తాయి. 50 స్టేషన్లలో చౌక మందుల కౌంటర్లను తెరవాలని రైల్వే నిర్ణయించింది. రైల్వే శాఖ చౌక ఔషధం పథకం ఏంటో తెలుసుకుందాం..

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. స్టేషన్‌లలో ప్రయాణికులకు చౌకగా మందులను అందించడానికి ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ కేంద్రాలను ఆవరణలో ఎక్కడ ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరకే మందులను అందజేస్తారు. అయితే ఇందుకోసం మెడికల్ స్టోర్ యజమానులు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.ఈ కేంద్రాలు 20 రాష్ట్ర, యూటీ స్టేషన్లలో తెరవబడతాయి. ప్రధానమైనవి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్

దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, వీరంగన లక్ష్మీ బాయి, లక్నో, గోరఖ్‌పూర్, బనారస్, ఆగ్రా కాంట్, మధుర, రిషికేశ్, కాశీపూర్, దర్బంగా, పాట్నా, కతియార్, జంగ్గీర్-నైలా, బాగ్‌బర్హా, సినీ, అంకలేశ్వర్, మెహసానా, పెండ్రా రోడ్, రత్లాం, రత్లాం, , సవాయి మాధోపూర్, భగత్ కి కోఠి, ఫగ్వారా మరియు రాజ్‌పురా ప్రధాన స్టేషన్‌లు ఇక్కడ ప్రారంభించబడతాయి.




