- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduced dual whatsapp feature Use Two Accounts on One Android Phone
WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒకే యాప్‌లో రెండు అకౌంట్స్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. ఇలా రకరకాల ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌తో యూజర్లను అట్రాక్ట్ చేసింది. తాజాగా లాక్‌చాట్, స్క్రీన్ షేరింగ్, మల్లీ డివైజ్ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా కొత్త ఫీచర్.? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Aug 12, 2023 | 2:06 PM

ఒక ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం ప్రస్తుతం లేదనే విషయం తెలిసిందే. ఒక ఫోన్‌లో కేవలం ఒకే వాట్సాప్ అకౌంట్‌ను మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

అయితే క్లోన్డ్ వాట్సాప్ వంటి వాట్సాప్ యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నా భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరూ వీటిని ఉపయోగించలేరు. అందుకే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఒకే వాట్సాప్‌తో వేర్వేరు అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇకపై ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇక ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా వాట్సాప్ అకౌంట్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద ఉన్న బాణం సింబల్‌తో మరో అకౌంట్‌ని యాడ్ చేసుకోవచ్చు.

దీని సహాయంతోనే వేరే ఖాతాకు మారొచ్చు. ఇలా ఒక అకౌంట్‌లో పర్సనల్ చాట్స్, మరో అకౌంట్‌లో ప్రొఫెషనల్‌కు సంబంధించిన చాటింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.





























