Bank statement: మీ బ్యాంక్ స్టేట్మెంట్లో దీనిని గమనించారా? లేకుంటే చాలా నష్టపోతారు? వివరాలు ఇవి..
మీ ఖాతాను సరిచూసుకున్నప్పుడు ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే మీరు బ్యాంకుకు తెలియజేయాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఆన్‌లైన్‌లో చూస్తున్నప్పుడు ఎప్పుడూ పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ని ఉపయోగించకూడదు.
బ్యాంక్ స్టేట్‌మెంట్.. దీని అందరూ వినే ఉంటారు. ప్రతి బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలు తెలియజేసేదే స్టేట్ మెంట్. తరచుగా ఏటీఎంలలో చాలా మంది మినీ స్టేట్ మెంట్ చూస్తుంటారు. అలాగే బ్యాంకులు నెలకోసారి మీ లావాదేవీలన్నీ క్రోడీకరించి ఒక స్టేట్‌మెంట్ ను అందిస్తాయి. దానిలో మీ ఖాతా నుంచి ఎప్పుడు ఎంత ఖర్చుపెట్టారు అనేది తెలిసిపోతుంది. ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు వినియోగదారులకు తమ ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్ ను ఈ మెయిల్ చేస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ పాస్ వర్డ్ దానికి ఉంటుంది. అయితే వీటి వల్ల ఉపయోగం ఏమిటి? బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు ఏమిటి? నెలవారీ చూసుకోవాలా? లేక సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలా? తెలుసుకుందాం రండి..
బ్యాంకు చార్జీలు తెలుస్తాయి..
బ్యాంక్ స్టేట్ మెంట్ అనేది మీ ఖాతాకు సారాంశం లాంటిది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించుకోవడం ద్వారా చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. మొదట మీ ఖాతాలపై ఏదైనా అవాంఛనీయ లావాదేవీ అంటే మీరు చేయని లావాదేవీ ఏమైనా ఉందా అన్న విషయం తెలుస్తుంది. అలాగే లావాదేవీపై బ్యాంకు చార్జీలు అధికంగా ఉన్నాయో అర్థం అవుతుంది. అందుకనే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ను కనీసం నెలకు ఓసారి తప్పనిసరిగా సరిచూసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఖాతా వినియోగదారులు తమ ఆర్థిక నిర్వహణకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు అద్భుతమైన వనరు. ఖాతాదారులు తమ వ్యయాన్ని పర్యవేక్షించడానికి, లోపాలను గుర్తించడానికి, నమూనాలను కనుగొనడానికి వీటిని ఉపయోగించవచ్చు. ప్రతి రోజు, ప్రతి వారం, లేదా ప్రతి నెల, ఖాతా వినియోగదారుడు వారి బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా, మోసం, లోపాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖర్చులు తగ్గించుకోవచ్చు.
వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి..
మీ ఖాతాను సరిచూసుకున్నప్పుడు ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే మీరు బ్యాంకుకు తెలియజేయాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఆన్‌లైన్‌లో చూస్తున్నప్పుడు ఎప్పుడూ పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ని ఉపయోగించ కూడదు. ఎందుకంటే పబ్లిక్ వైఫై నుంచే హ్యాకర్లు మీ ఖాతాను హ్యాక్ చేసే ప్రమాదం పొంచి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..